Published On:

Nilave Poster Out: నిజాయితీకి అర్థం ఉంటే అది మా సినిమా ‘నిలవే’: హీరో సౌమిత్ రావు!

Nilave Poster Out: నిజాయితీకి అర్థం ఉంటే అది మా సినిమా ‘నిలవే’: హీరో సౌమిత్ రావు!

Tollywood New Movie Nilave Poster Launched: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నిలవే’. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌమిత్‌ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ మూవీ టీం పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటోంది.

 

ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్‌ సౌమిత్‌ రావు మాట్లాడుతూ.. ”నిలవే’ ఈ సినిమా మంచి మ్యూజికల్‌ లవ్‌ డ్రామాగా రాబోతుందన్నారు. నిలవేలో అంత కొత్త వాళ్లం కలిసి చేస్తున్నాం. మేం ఎంతో నిజాయితీతో ఈ సినిమాని చేశాం. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి. నిజాయితీకి అర్థం ఉంటే అది మా ‘నిలవే’. ఈ సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది” అంటూ అన్నారు.

 

దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ .. ‘మాది చిన్న టీం. మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ మా సినిమా కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయితీగా ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మేము కేవలం కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవ’ చాలా మంచి సినిమా. అందరూ మా సినిమాకు సపోర్ట్ చేయండి” అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు నటించారు.

 

ఇవి కూడా చదవండి: