Published On:

Anupam Kher: హైదరాబాద్‌లో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ – గోడ దూకి వెళ్లిన ప్రముఖ నటుడు

Anupam Kher: హైదరాబాద్‌లో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ – గోడ దూకి వెళ్లిన ప్రముఖ నటుడు

Anupam Kher Climbs Wall to Reach Prabhas Movie Shooting Set: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సినిమా షూటింగ్‌ వెళ్లేందుకు పెద్ద స్టంటే చేయాల్సి వచ్చింది. సినిమా కోసం కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు అంటున్నారు ఆయన. ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ కోసం గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆయన వీడియో తీశారు. కాగా ప్రభాస్‌ హీరోగా సీతారామం ఫేం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫౌజీ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగర శివారులో జరుగుతున్న ఈ షూటింగ్‌లో అనుపమ్‌ ఖేర్‌ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్‌కి ఆయన గోడ దూకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో ఈ విధంగా ఎప్పుడు షూటింగ్‌కి వెళ్లలేదు అంటూ తన పోస్ట్‌ రాసుకొచ్చారు. “40 ఏళ్ల ఈ సినీ కెరీర్‌లో సినిమా షూటింగ్‌లోకు ఎన్నో విధాలుగా వెళ్లాను. కానీ, ఇవాళ నేను షూటింగ్‌ వెళ్తున్న విధానం కొత్తగా ఉండటమే కాదు.. కాస్తా సరదాగానూ అనిపిస్తుంది.

 

ప్రభాస్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఈ షూటింగ్‌లోకేషన్‌కి రావడానికి నా డ్రైవర్‌ కాస్తా అడ్వెంచర్‌ చేద్దామని నిర్ణయించుకున్నాడామో. కొంతసేపటి మేము ఓ అడవిలోకి వచ్చాము. తీరా చూస్తే అది డెడ్‌ ఎండ్‌. దీంతో కారుని వెనక్కి తీయడం కుదరలేదు. దాని పక్కనే షూటింగ్‌ లోకేషన్‌ ఉంది. సెట్స్‌ వెళ్లడానికి ఏం చేశామో మీరు ఈ వీడియో చూడండి” అంటూ రాసుకొచ్చారు. 70 ఏళ్ల వయసులో ఆయన ఈ గోడదూకి వెళ్లడంతో అభిమానులంత ఆయన వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘కెరీర్‌ ప్రారంభంలో మీరు ముసలి వ్యక్తి నటించారు.

 

కానీ 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా అనుపమ్‌ ఖేర్‌కు ఇది 544వ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. ఈ క్రమంలో తనకు ఈ మూవీ ఆఫర్‌ రావడంపై అనుపమ్‌ ఖేర్‌ స్పందిస్తూ.. “ఇండియన్‌ చిత్ర పరిశ్రమకు బాహుబలిగా పేరొందిన ప్రభాస్‌తో కలిసి నా 544వ సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందులో ప్రభాస్‌ జంట సోషల్‌ మీడియాలో స్టార్‌ ఇమాన్వీ నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)