Published On:

Sonali Bendre: ప్రముఖ రాజకీయ నాయకుడితో సోనాలి బింద్రే రిలేషన్‌ – క్లారిటీ ఇచ్చిన నటి

Sonali Bendre: ప్రముఖ రాజకీయ నాయకుడితో సోనాలి బింద్రే రిలేషన్‌ – క్లారిటీ ఇచ్చిన నటి

Sonali Bendre Reacts on Rumours that Raj Thackeray Crush on Her: నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరో సరసన నటించింది. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వెండితెరకు దూరమైంది. పెళ్లై వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఆమె క్యాన్సర్‌ బారిన పడింది బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి చికిత్స తీసుకుని మహామ్మారిని జయించింది.

 

ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తున్న సోనాలి బింద్రే.. వరుస ఇంటర్య్వూలో బిజీగా ఉంది. ఈ క్రమంలో తనపై వచ్చిన ఎన్నో రూమర్స్‌, వార్తలపై స్పందించింది. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా సెట్‌లో సల్మాన్‌ తీరు చూస్తే తనకు చాలా కోపం వచ్చేదంది. కానీ, తాను క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆయన అక్కడికి వచ్చిన మరి తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. అలాగే ఓ రాజకీయ నాయకుడితో ప్రేమ, పెళ్లి రూమర్స్‌పై కూడా స్పందించారు.

 

20 ఏళ్ల క్రితం పొలిటిషియన్‌ రాజ్‌ థాకరే ఆమెను ఇష్టపడ్డారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్య్వూలో దీనిపై ఆమెను ప్రశ్నించగా.. సోనాలి బింద్రే అసహనం వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదని, తాను ఎప్పుడూ అలాంటి వార్తలన వినలేదని తెలిపారు. “నా గురించి ఇలాంటి ఒక వార్త ప్రచారం జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు. సోషల్‌ మీడియాలో నా గురించి ఇలా మాట్లాడుకున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్‌ థాకరే భార్య షర్మిలా తల్లి.. మా పిన్ని మంచి స్నేహితురాళ్లు.

 

నా చిన్నప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే కొనసాగుతుంది” అని సమాధానం ఇచ్చారు. కాగా 30 ఏళ్ల క్రితం అమెరికన్‌ పాప్‌ సింగర్‌, దివంగత మైఖేల్‌ జాక్సన్‌ ఇండియా వచ్చినప్పుడు ఆయనకు ఆహ్వానించేందుకు వెళ్లిన పలువురు ప్రముఖుల్లో సోనాలి బింద్రే, రాజ్‌ థాకరే ఉన్నారు. అదే టైంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్‌ వినిపించాయి. అప్పట్లో ఇది ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మళ్లీ 30 ఏళ్ల తర్వాత సోనాలి, రాజ్‌ థాకరే మళ్లీ ఒక ఈవెంట్‌లో కనిపించారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో సోనాలి, రాజ్‌ నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో మళ్లీ ఆ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి.