Published On:

Director Maruti: ఒట్టేసి చెబుతున్నా ‘ది రాజాసాబ్‌’ ఓ వేడుకలా ఉంటుంది.. ప్రభాస్‌ మూవీపై డైరెక్టర్‌ మారుతి బిగ్‌ అప్‌డేట్‌

Director Maruti: ఒట్టేసి చెబుతున్నా ‘ది రాజాసాబ్‌’ ఓ వేడుకలా ఉంటుంది.. ప్రభాస్‌ మూవీపై డైరెక్టర్‌ మారుతి బిగ్‌ అప్‌డేట్‌

Director Maruthi About The Raja Saab and His Career: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ‘ది రాజాసాబ్‌’ మూవీ ఒకటి. ఇటీవల ఈ చిత్రం రెండు బిగ్‌అప్‌డేట్స్‌ వచ్చాయి. ఒకటి టీజర్‌,మరోకటి రిలీజ్‌ డేట్. దీంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటి మరింత పెరిగిపోయింది. జూన్‌ 16న వచ్చే టీజర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ మారుతి మరో క్రేజీ అప్‌డేట్‌ వదిలారు. ఆంధ్రప్రదేశ్‌ మచిలీపట్నంలో నిర్వహిస్తున్న బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు. మనిషి కష్టపడితే సాధించలేనిదంటూ ఉండదన్నారు. దీనికి ప్రత్యేక ఉదహరణ తానే అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “1999లో తొలిసారి హైదరాబాద్‌ వెళ్లాను. అంతకంటే ముందు వైజాగ్‌లో అరపండ్లు అమ్మేవాడిని. అక్కడ రాధికా థియేటర్ల ముందు మా నాన్నకు అరపండ్ల బండి ఉండేది. ఆయనతో కలిసి నేను అరటిపండ్లు అమ్మాను. పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడల్లా వాటిని చూసి నా నోట్‌బుక్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్‌ వచ్చాను. స్టిక్కరింగ్‌ షాపు ఒపెన్‌ చేసి నెంబర్‌ ప్లేట్స్‌ తయారు చేసేవాడిని.

 

ఓ వైపు హిందూ కాలేజీలో చదువుకుంటూనే మరోవైపు నెంబర్‌ ప్లేట్స్‌ తయారు చేసేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఇప్పుడిదంత ఎందుకు చెబుతున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైన వెళ్తాడనడానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని, పండ్లు అమ్ముకున్న తాను ఇప్పుడు రూ. 400 కోట్ల బడ్జెట్‌ మూవీ తీస్తున్నానంటూ పేర్కొన్నాడు. అనంతరం రాజా సాబ్‌ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుందన్నారు. జూన్‌ 16న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నామని తెలిపాడు. మరోవైపు ఎక్క్‌ వేదికగా ది రాజా సాబ్‌ మూవీ వేడుక అంటూ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచారు.

 

ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ వచ్చి 12ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌ బాపు 12 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి మారుతి రీట్వీట్ చేస్తూ.. “ఇప్పటికీ ప్రేమకథా చిత్రమ్‌ జ్ఞాపకాలు నా మైండ్‌లో ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ యానివర్సరీ మరింత ఉత్సహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి జోన్‌లోకే వెళ్తున్నాను. కానీ ఈసారి హారర్‌ ఫ్యాంటసీ. ఒట్టెసి చెబుతున్నా ది రాజాసాబ్‌ ఖచ్చితంగా ఒక వేడుకలా ఉంటుంది” అని రాసుకొచ్చారు. కాగా ఈ రోజుల్లో, ప్రేమకథా చిత్రమ్‌, భలే భలే మగాడివోయ్‌, ప్రతిరోజు పండగే, బాబు బంగారం వంటి చిత్రాలు తెరకెక్కించారు మారుతి.