NBK111: ఆ స్టార్ డైరెక్టర్ మళ్లీ జతకట్టిన బాలయ్య – ఎన్‌బీకే111 అధికారిక ప్రకటన వచ్చేసింది.. హిస్టారికల్ రోర్ రిపీట్

Nandamuri Balakrishna NBK 111 Movie Official Announcement: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ దూసుకపోతున్నాడు. యంగ్ హీరోలతో పోటీ సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఇంసడ్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానం ముగించుకున్న ఆయన ఇప్పటీకీ అదే జోష్,అదే క్రేజ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తగ్గేదే లే అంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ఆయన ప్రస్తుతం ‘అఖండ 2’ సిసినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం సెట్‌లో ఉండగానే మూవీని కమిట్ అయ్యారు. స్టార్ డైరెక్టర్‌తో 111వ సినిమా కోసం జతకట్టారు. జూన్ 10న ఆయన పుట్టని రోజు సందర్భంగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ నందమూరి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఉగ్రరూపంతో ఉన్న సింహిం ఓ వైపు.. లోహం మాస్క్‌తో మరోవైపు ఉన్న పోస్టర్ షేర్ చేస్తూ ‘ది హిస్టారికల్ రోర్ బిగెన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి హైప్ ఇచ్చారు. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరంటే మాస్ ఎంటర్‌టైనర్‌కు కేరాఫ్ గోపిచంద్ మలినేని. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌లో ఆరితేరిన గోపించంద్ బాలయ్య కోసం ఈసారి హిస్టారికల్ జానర్‌ని టచ్ చేయబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీస్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి హిట్ కాంబో.. మరోసారి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగివస్తుంది. చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఫ్యాన్స్ అంచనాలను మరింత రెట్టింపు చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో బాలయ్య కనిపించబోతున్నాడని ఈ ప్రకటనతో అర్థమైపోతుంది. త్వరలోనే ఈ సినిమా పూజ కార్యక్రమంతో ప్రారంభం కానుంది.
The ROARING BLOCKBUSTER combo reunites ❤️🔥
HISTORICAL ROAR BEGINS 🦁💪🏽🔥#NBK111 will be a celebration of the 'GOD OF MASSES' #NandamuriBalakrishna on the big screens 👑
Directed by the Blockbuster Mass Director @megopichand ⚡
Produced by the passionate #VenkataSatishKilaru… pic.twitter.com/uQv9NmYb98
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 8, 2025