Thug Life OTT Release: కమల్ థగ్ లైఫ్ ఓటీటీ పార్ట్‌నర్ ఇదే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Thug Life Movie OTT Partner and Streaming Details: లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్రలో నటించి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమిది కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ పడుతున్నారు. మణిరత్నం మార్క్ సినిమాలో కనించలేదని అంటున్నారు.
ఓ వర్గం ఆడియన్స్ నుంచి మాత్రం పాజిటివ్ టాక్ వస్తుంది. ఇలా తొలిరోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. త్రిష, అభిరామి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ వివరాలు ఆసక్తికరంగా మారాయి. 38 ఏళ్ల తర్వాత కమల్ మణిరత్నం కలయికలో వచ్చిన ఈ సినిమా కావడంతో థగ్‌లైఫ్‌పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 149 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే శాటిలైట్ రైట్స్‌ని స్టార్ విజయ్ టీవీ రూ. 60 కోట్లకు కొనగోలు చేసినట్లు తమిళ మీడియా వార్తలు వచ్చాయి. థియేటర్స్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందంలో నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందట. ఈ లెక్కన ఆగస్ట్ మొదటి వారం లేదా రెండో వారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఒప్పంద చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా రానుంది. అయితే స్వతంత్ర దినొత్సం (ఆగష్టు 15) కానుకగా ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.