Published On:

Kannappa OTT: ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

Kannappa OTT: ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

Manchu Vishnu About Kannappa OTT Deal and Release: మరికొన్ని రోజుల్లో కన్నప్ప మూవీ థియేటర్లకు రానుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరూ చేసిన టీం.. మరింత వేగవంతం చేసింది. మంచు విష్ణు వరుస ఇంటర్య్వూలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు కన్నప్ప మూవీపై ఓ స్పెషల్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మూవీ ఓటీటీ డీల్‌తో పాటు దీనిపై వస్తున్న రూమర్స్‌పై స్పందించాడు.

 

కాగా కన్నప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని అప్పట్లో విష్ణు చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో కన్నప్ప ఓటీటీ రిలీజ్‌ ఉంటుందా? లేదా? అని ఎన్నో సందేహాలు వస్తున్నాయి. వీటన్న్నింటికి విష్ణు తాజాగా చెక్‌ పెట్టాడు. ఈ తాజాగా ఇంటర్య్వూలో కన్నప్ప ఓటీటీ డీల్‌ కుదిరిందా? అని ప్రశ్నించారు. “ఓ పెద్ద ఓటీటీ సంస్థ వద్దకు వెళ్లాను. వాళ్లు చెప్పిన ఫిగర్‌ నాకు నచ్చలేదు. నేను ఓ పెద్ద నెంబర్‌ అడిగాను. వాళ్లు కుదరదని ఓ ఫిగర్‌ చెప్పారు. ఈ నెంబర్‌ నాకు అంత సాటిసిఫైంగ్‌గా అనిపించలేదు. దీంతో మూవీ రిలీజై హిట్‌ అయిన తర్వాత అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. దానికి వాళ్లు ఓ ఫిగర్‌ చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. ‘అయితే చెక్‌ రెడీ చేసి పెట్టుకోండి.. మూవీ విడుదలయ్యాక వస్తాన’ అని చెప్పాను” అని చెప్పుకొచ్చాడు.

 

కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ సినిమా అయిన థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీ్కి రావాల్సిందే. అలాగే కన్నప్ప కూడా. అయితే దీనికి కాస్తా టైం పట్టేలా ఉంది. ఒప్పందం ప్రకారం ఏ సినిమా అయినా థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఏనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ కావాలి. బాలీవుడ్ దీనిని తూ.చ పాటిస్తోంది. కానీ దక్షిణాదిలోనే ఆ ఒప్పందం జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు సినిమాలు వాటి ఫలితాన్ని బట్టి ఓటీటీకి వస్తున్నాయి. కొన్ని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమాలు సైతం నెలల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్నాయి. మరి కన్నప్ప ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడస్తుందనేది రిలీజ్‌ తర్వాత క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: