Mohan Babu about Mother: నా మాటలు నా తల్లికి వినిపిస్తే బాగుండు.. నాకు నా తల్లే ‘కన్నప్ప’..
Mohan Babu Remembers His Mother: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ఇది రూపొందుతోంది. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ను మూవీ ప్రమోషన్స్ వినూత్నం ప్లాన్ చేస్తున్నాడు. ఓ వైపు ప్రెస్‌మీట్స్ పెడుతూనే మరోవైపు కన్నప్ప మూవీ గురించి విశేషాలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే కామిక్ బుక్ పేరుతో కార్టూన్ రూపంలో కన్నప్ప స్టోరీని పరిచయం చేశాడు.
సిరీస్‌ల పేరుతో వరుసగా వీడియోలు షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మై కన్నప్ప స్టోరీ అంటూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా కన్నప్పకు సంబంధించి విశేషాలను షేర్ చేసుకుంటున్నాడు. కన్నప్ప పరమ శివుడి కోసం తన జీవితాన్ని ఆర్పించాడని, అలాంటి వారు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటారన్నాడు. అలా తన జీవితంలో తన కన్నప్ప తన తండ్రి మోహన్ బాబు అని, ఆయన క్రషి, త్యాగాల ఫలితంగానే తాను నటుడిగా ఇలా ముందు ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు సైతం మై కన్నప్ప స్టోరీ అంటూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. “ఓ అమాయకుడు ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి కళ్‌లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. మన జీవితంలో అమ్మ చెప్పకుండానే మన ఆకలి తీరుస్తుంది. ఏది కావాలంటే అది శక్తికి మించినదైనా సరే అమ్మనాన్న మనకు ఇస్తుంటారు. నా దృష్టిలో మా అమ్మానాన్నే నా కన్పప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ, దురదృష్టవశాత్తూ అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానం ఇచ్చాడు. బస్సు దిగి మా ఊరికి నడిచి వెళ్లాలంటే ఏడు కిలోమిటర్లు నడవాలి. ఆ దారి కూడా సరిగా ఉండేది కాదు.
చెవులు వినిపించని నా తల్లి ఐదుమంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్లేదంటే ఎంత కష్టమో ఆలోచించండి దారిలో ఒక కాలువ, సువర్ణముఖి నది దాటి వెళ్లాలి. మాది ద్వీపంలాంటి ఊరు. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు.. నా మాటలు తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నా కు నా కన్నతల్లే కన్నప్ప అని చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ మోహన్‌లాల్, లక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
#MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/uFJUAE0qVg
— Mohan Babu M (@themohanbabu) June 5, 2025