Published On:

Akhanda 2 Teaser: బాలయ్య ఫ్యాన్స్ గెట్‌ రెడీ – అఖండ 2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌, రేపు తాండవమే..

Akhanda 2 Teaser: బాలయ్య ఫ్యాన్స్ గెట్‌ రెడీ – అఖండ 2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌, రేపు తాండవమే..

Akhanda 2 Teaser Release Update: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ‘నందమూరి బాలకృష్ణ’ ప్రస్తుతం అఖండ 2 మూవీతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. 2021లో వచ్చిన అఖండ మూవీ ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్‌ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.

 

ఇక జూన్‌ 10 ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్‌ కోసం అఖండ 2 నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. ఒక్క రోజు ముందే అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇస్తున్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది. జూన్‌ 9న అఖండ 2 టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రేపు (సోమవారం) సాయంత్రం 6:03 గంటలకు టీజర్‌ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎం తేజస్వీని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట్‌, గోపీ ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్‌, ఆది పినిశెట్టిలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

బాలయ్య బర్త్‌డే సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్‌ వరుసగా గుడ్‌న్యూస్‌ అందిస్తున్నారు మూవీ మేకర్స్‌. ఇప్పటికే బాలయ్య స్టార్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనితో ఓ సినిమా కమిటైనట్టు ఇవాళ అధికారిక ప్రకటన వచ్చింది. ఆయన నూటపదకొండవ సినిమాగా ఇది తెరెకెక్కనుంది. NBK 111 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఫ్యాన్స్‌ క్యూరియాసిటీ పెంచింది. సింహం ఒకవైపు మరోవైప లోహాపు మాస్క్‌తో హిస్టారికల్‌ రోరింగ్‌ బిగైన్‌ అంటూ అప్‌డేట్‌ ఇచ్చారు. అలాగే ఆయన 112 సినిమాగా తమిళ డ డైరెక్టర్‌తో జతకట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

 

కాగా అఖండ 2 చిత్రాన్ని దసరా సందర్బంగా సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టలు తెలుస్తోంది. ఇప్పటి వరకు దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ రేపు రిలీజ్‌ సందర్భంగా మూవీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్‌లో అయితే పవన్‌ ఓజీతో పోటీ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రకటించారు. ప్రచారం ప్రకారం.. ఈ రెండు సినిమాలు దసరా బరిలో పోటీ పడతాయా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.