Russia : ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. 315 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

Russian attacks on Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా వరుసగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఎప్పుడూ లేనంత తీవ్రస్థాయిలో భీకర దాడులు చేస్తోంది. రాత్రి సమయంలో ఉక్రెయిన్‌పై 315 షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది. దాడుల్లో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
315 డ్రోన్‌లతోపాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్-23 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఇస్కాండర్-కె క్రూయిజ్‌లను ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది. 213 డ్రోన్లు, ఏడు క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్యమైనట్లు మీడియా పేర్కొంది. రష్యా దాడులతో దక్షిణ నగరంలో ప్రసూతి ఆసుపత్రి, వైద్య పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
479 డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. మరోసారి భీకర దాడులు నిర్వహించింది. ఇటీవల జరిగిన దాడిలో 20 క్షిపణులను ప్రయోగించిందని, మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లో ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొన్నట్లు కీవ్ వాయుసేన వెల్లడించింది. మాస్కో ఉపయోగించిన 277 డ్రోన్లు, 19 క్షిపణులను కూల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. పది డ్రోన్లు లేక క్షిపణులు మాత్రమే లక్ష్యాలను చేరినట్లు పేర్కొంది.