Published On:

OG Vs Akhanda 2: బాక్సాఫీసు పోరు – అటూ బాలయ్య.. ఇటూ పవన్‌.. తగ్గేది ఎవరు?

OG Vs Akhanda 2: బాక్సాఫీసు పోరు – అటూ బాలయ్య.. ఇటూ పవన్‌.. తగ్గేది ఎవరు?

OG Vs Akahanda 2 Box Office Between Balakrishna and Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు థియేటర్ల బంద్‌ ఇష్యూ, మరోవైపు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడి రాజీనామా, హరి హర వీరమల్లు రిలీజ్‌ వాయిదా. ఇవన్ని చూస్తుంటే అసలు టాలీవుడ్‌కి ఏమైందీ, ఏం జరుగుతుందనే రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు అగ్ర హీరో బాక్సాఫీసు పోరు ఇప్పుడు ఫ్యాన్స్‌ మధ్య ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరు ఎవరూ తగ్గుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.

 

ఇంతకీ ఆ స్టార్‌ హీరోల ఎవరంటే ఒకరు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మరోకరు నందమూరి బాలకృష్ణ. నిజానికి తెలుగులో స్టార్‌ హీరోలంత పండగ సీజన్‌పై కన్నెస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి ఇవి టాలీవుడ్‌ బాక్సాఫీసుకి చాలా కీలకం. ఈ పండగలోనే పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడతాయి. సంక్రాంతికి రామ్‌ చరణ్‌, బాలయ్య, వెంకటేష్‌లు పోటీ పడగా.. అందులో వెంకీమామ కాస్తా ముందంజలో ఉన్నారు. నెక్ట్స్‌ దసరా, దీపావళిపైనే కన్నేశారు. చాలా రోజుల క్రితమే సెప్టెంబర్‌ 25న పవన్‌ కళ్యాణ్‌ ఓజీ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ ప్రకటించింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న ‘అఖండ 2’ టీజర్‌ని రిలీజ్‌ చేశారు.

 

ఈ సందర్భంగా మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఓజీ విడుదల రోజునే అఖండ 2 రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారు. దీంతో ఈసారి దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద గట్టిపోరు కనిపించేలాగే ఉంది. ఎందుకంటే పవన్‌ చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఓజీపైనే ఎక్కువ బజ్‌ ఉంది. సాహో మూవీ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవల మళ్లీ సెట్స్‌పైకి వచ్చింది. ఫుల్‌ జోష్‌లో షూటింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్‌. మరోవైపు అఖండ 2 సైతం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన అఖండ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చెప్పాలంటే ఓజీతో పోలిస్తే.. అఖండ 2పైనే కాస్తా బజ్‌ ఎక్కువగా ఉంది.

 

మరి ఈ టైంలో రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఏదోక సినిమాలకు కష్టాలు తప్పవు. అందులో పవన్‌ ఓజీనే ఈ నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆడియన్స్‌, సినీ విశ్లేషకులు కూడా అదే అంటున్నారు. మరి ఈ పోరు ఏ హీరో తగ్గుతారో చూడాలి. ముందు ఓజీ మూవీనే ఈ డేట్‌ని ఫిక్స్‌ చేసింది.. కాబట్టి అఖండ టీం తగ్గుతుందా? షూటింగ్, ఇతర పనుల వల్ల ఓజీ తగ్గుతాడా? అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి నువ్వా-నేనా అన్నట్టు బాలయ్య-పవన్‌లు బాక్సాఫీసు వద్ద పోటీ పడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీపావళికి సెప్టెంబర్‌ 25 బాక్సాఫీసు పోరు ఎలా ఉండనుందనేది ఇటూ ఫ్యాన్స్‌, అటూ ట్రేడ్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరి ఆ రోజు ఏం జరగుతుంతో జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ.