Published On:

Kantara Chapter 1 Postponed: కాంతార: చాప్టర్‌ 1 వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

Kantara Chapter 1 Postponed: కాంతార: చాప్టర్‌ 1 వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

Makers React on Kantara Chapter 1 Postponed Rumors: కాంతార: చాప్టర్‌ 1 షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా విషాదాలు వెంటాడుతున్నాయి. షూటింగ్‌ ప్రారంభమైన కొన్ని రోజులకే సెట్లో ప్రమాదం చోటుచేసుకోగా.. ఓ వ్యక్తి మరణించారు. అలాగే ఈ సినిమాలోని జూనియర్‌ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బొల్తా పడి కొందరు గాయపడ్డారు. ఇటీవల ఈ మూవీ టెక్నికల్‌ డిపార్టుమెంట్‌లో పని చేసే వ్యక్తి మరణించారు. వేరు వేరు ఘటనల్లో ఇద్దరు నటులు ప్రమాదం బారిన పడి మృతి చెందారు.

 

ఇదిలా ఉంటే గతంలో ఈ మూవీ డైరెక్టర్‌, నటుడు రిషబ్‌ శెట్టిని పంజుర్లీ దేవర హెచ్చరించినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇలా చిత్రాన్ని వరుస వివాదాలు వెంటాడుతుండటంతో ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మూవీ షూటింగ్‌ కొనసాగుతుందా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా ఉంటుందని, అనుకున్న తేదీకే వస్తుందని చిత్ర మేకర్స్‌ ముందు నుంచి క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. ఇటీవల నెలకొన్న వరుస విషాదాల నేపథ్యంలో కాంతార 2 మూవీ వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతుంది.

 

కాంతార చాప్టర్‌ 1 వాయిదా నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వార్తపై తాజాగా మూవీ టీం స్పందించింది. తమ సినిమా గురించి వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని, సమయానికే వస్తున్నామని స్పష్టం చేసింది. “అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. అంతా ప్లాన్‌ చేసినట్టుగానే షూటింగ్‌ పనులు బాగా జరుగుతున్నాయి. ఏదీ ఏమైనా ముందుగా అనుకున్న తేదీకే వస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. వీ ఎదురుచూపులకు ఖచ్చితమైన సమాధానం వస్తుంది. వేచి ఉండటం ఎంత విలువైందో మీకే అర్థమవుతుంది. కాంతార సినిమాపై వస్తోన్న ఊహాగానాలను నమ్మకండి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని” మూవీ టీం విజ్ఞప్తి చేసింది.

 

కాగా కాంతార: చాప్టర్‌ 1ను అక్టోబర్‌ 2, 2025న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. కాగా 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ఇది ప్రీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. మొదట కన్నడ ప్రాంతీయ సినిమా విడుదలైన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళ్‌, హిందీ,మలయాళ భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్‌తో సంచలన విజయం సాధించింది.