TG POLYCET- 2025 Out: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రిలీజ్

TG POLYCET- 2025 Out Now: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ విడుదల చేశారు. మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 83,364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.33 గా నమోదైంది. పరీక్షకు బాలురు 53,085 మంది హాజరుకాగా.. 42,836 మంది (80.69) మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు బాలికలు 45,773 మంది హాజరుకాగా.. 40,528 మంది (88.54) శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ http://www.polycet.sbtet.telangana.gov.in/#!/index ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. పాలిసెట్ లో మొత్తం 120 మార్కులకు పరీక్షలు నిర్వహించగా.. అందులో 36 మార్కులు వచ్చిన విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. 18,037 మంది ఎస్సీ విద్యార్థులకు, 7,459 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించారు.