OG Producer: దయచేసి ఆయనను ఇబ్బంది పెట్టకండి – అది మన కనీస బాధ్యత
Pawank Kalyan OG Producer DVV Danayya: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నిర్మాత ఓ విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టకండి అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందరు ఓజీ (OG Movie)పైనే అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో పవన్ ఎక్కడ కనిపించిన ఓజీ.. ఓజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన సంఘటనపై ఓజీ నిర్మాత స్పందిస్తూ అభిమానులకు విన్నపం చేశారు.
“ఓజీ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమను మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం, సందర్భంగా చూడకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికి తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఒపికగా ఉందాం. 2025లో ఓజీ (OG) పండగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము” అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఏమైనా అప్‌డేట్ ఇవ్వండని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Aaayanni Ibbandhi Pettakandraaa… Inkonchem time undhi…. Allaaadiddaam Theatres lo..#TheyCallHimOG #OG #FireStormIsComing pic.twitter.com/AjegAndqAh
— DVV Entertainment (@DVVMovies) December 28, 2024
కాగా నిర్మాణ సంస్థ ఇలా స్పందించడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో తన బాధ్యతలను నిర్వహిస్తూనే మరోవైపు తాను సైన్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇలా ప్రజాసేవతో పాటు సినిఆ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయనను చూసినప్పుడల్లా అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవోను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయనపై దాడిని ఖండించారు. ఈ క్రమంలో ఆయన ఘటనపై సీరియస్ అయ్యారు.
అయితే ఆయనను చూసిన అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ ఓజీ.. ఓజీ అని నినాదాలు చేశారు. అది విన్న ఆయన అభిమానులపై అసహనం చూపించారు. ఏంటీ మీరు ఎప్పుడు ఏ స్లోగన్ చేయాలో తెలియదు. జరగండి అని కాస్తా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పనిని ఆయనను చేసుకోనివ్వండని, ఇబ్బంది కలిగించవద్దంటూ నిర్మాణ సంస్థ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఈ పోస్ట్ చేసింది. ఇక ఓజీ మూవీ విషయానికి వస్తే.. ముంబై-జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగస్టర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతికథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.