Geetu Royal Emotional Post: జనాలు ఇలా చనిపోతున్నారు ఎంటీ.. గీతూ రాయల్ వైరల్ వీడియో

Bigg Boss Fame Geetu Royal Shared Emotional Video: బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అందులో గీతూ రాయల్ ఒకరు. సీజన్ 6 లో చిత్తూరు చిరుత అంటూ అక్కడి యాసతో మాట్లాడి తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. ‘నేను ఇలానే ఉంటా.. నాకు నచ్చినట్టే ఆడుతా’ అంటూ బిగ్ బాస్ హౌస్ లో గీతూ చేసిన హడావిడి, రచ్చ అంతా ఇంతా కాదు. అందరిది ఓ దారి అయితే.. నాది మరోదారి అంటూ విచిత్రంగా ప్రవర్తించిన గీతూ టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయింది.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తరచుగా ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. అయితే సొసైటీలో రెగ్యులర్ గా జరిగే అంశాలపై గీతూ ఎక్కువగా వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “ఈ మధ్య ఎక్కడ చూసిన జనాలు చనిపోయిన న్యూసే వినిపిస్తోంది. మరీ చీమలు చచ్చిపోయినట్టు పోతున్నారు జనాలు. హ్యాపీగా హనీమూన్ కి వెళ్దామని వెళ్తే అక్కడ టెర్రరిస్టులు చంపేస్తున్నారు. లేదా భార్య చంపేస్తుంది.. తల్లి పిల్లల్ని చంపి కుక్కర్లో ఉడకబెడుతుంది. బస్సులు, రైళ్లు, విమానాల ప్రమాదాల్లో చనిపోతున్నారు. మొన్న విమాన ప్రమాదంలో 250 మంది చనిపోయారు.’ అని చెప్పుకొచ్చింది.
తనకు కూడా 20 రోజుల కిందట ఘోరమైన యాక్సిడెంట్ అయిందని, జస్ట్ సెకండ్ లో చావు నుంచి బయటపడ్డాను అని తెలిపింది. మనం బతికి ఉన్నామంటే అది అదృష్టమనే చెప్పాలని, అందుకే మనకు నచ్చింది చేసేయ్యాలి.. అందరిని ప్రేమించాలని చెప్పింది. నీ ఎమోషన్స్ అన్ని చూపించెయ్.. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వేరేవాళ్లకు బాధ కలిగించనంత వరకు నెక్స్ట్ సెకన్ నువ్వు చనిపోయినా నీకు ఎలాంటి పశ్చాత్తాపం కలగదు అనేలా జీవించాలి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గీతూ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.