Published On:

New Voter Id Cards: ఓటర్ ఐడీల జారీలో కొత్త విధానం.. ఈసీ కీలక ప్రకటన!

New Voter Id Cards: ఓటర్ ఐడీల జారీలో కొత్త విధానం.. ఈసీ కీలక ప్రకటన!

New Voter Id Cards: దేశంలో ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానం ప్రవేశపెట్టింది. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డులు, కొత్త కార్డు లేదా అప్డేట్ కార్డులను 15 రోజుల్లోనే ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డు అందజేయడానికి నెల కంటే ఎక్కువ సమయం పడుతోంది. మరోవైపు ఓటర్ గుర్తింపు కార్డు జారీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ప్రజలకు తెలిసేది కాదు. దీంతో ఓటర్లు చాలా ఇబ్బందులు పడేవారు.  ఈసారి మాత్రం ఈపీఐసీ స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలపనున్నారు.

 

దీంతో 15 రోజుల్లోనే ఓటర్ కార్డును అందజేయనున్నారు. కాగా ఈ కొత్త విధానం కొత్తగా వివరాలు నమోదు చేసుకున్న వారికి, ఓటర్ వివరాల్లో మార్పులు చేసుకున్న వారికి వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ఈ కొత్త వ్యవస్థ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఈపీఐసీ జనరేషన్ నుంచి పోస్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఓటర్ కు కార్డు డెలివరీ అయ్యే వరకు ప్రతి దశను రియల్ టైమ్ ట్రాకింగ్ చేస్తుందని పోల్ అథారిటీ తెలిపింది.