Fastag Details: ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది..? బ్యాలెన్స్ చెకింగ్, రీఛార్జ్ ఎలా చేయాలంటే..?

How to check Fastag Balance, Recharge and Work: ఫాస్టాగ్.. అనే పదం జాతీయ రహదారులపై ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను సులభంగా, వేగంగా చెల్లించేందుకు ఈ ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిని వాహనం యొక్క ఫ్రంట్ సైడ్ అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ద్వారా టోల్ గేట్ వద్ద ఆటోమేటిక్‌గా చెల్లింపు జరుగుతుంది. ఇది బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్‌తో లింక్ చేయబడి ఉంటుంది.
ఇదిలా ఉండగా, స్టిక్కర్ ఇన్‌స్టాలేషన్ అనగా ఫాస్టాగ్ స్టిక్కర్‌ను వాహనం యొక్క ముందు గాజుపై అతికిస్తారు. అలాగే దీనిని లింక్ చేస్తారు. మీ బ్యాంక్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్ లేదా యూపీఐతో లింక్ అవుతుంది. ఆ తర్వాత టోల్ గేట్‌లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ స్కానర్ ఫాస్టాగ్‌ను చదివి, టోల్ ఛార్జీని ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేసేస్తుంది. ఫైనల్‌గా చెల్లింపు పూర్తయిన వెంటనే ఎస్ఎంఎస్ లేదా యాప్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది.