Published On:

Peddi OTT Deal: అప్పుడే ‘పెద్ది’ ఓటీటీ డీల్‌ క్లోజ్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Peddi OTT Deal: అప్పుడే ‘పెద్ది’ ఓటీటీ డీల్‌ క్లోజ్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Ram Charan Peddi OTT Deal Closed with Netflix: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా చరణ్‌ బ్యాట్‌ పట్టుకుని ఇచ్చిన షాట్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అనేలా ఉంది. ఈ షాట్‌ను ఐపీఎల్‌ టీం సైతం కాపీ కొట్టింది.

 

‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం తర్వాత పెద్దితో చరణ్‌ గట్టి కంబ్యాక్‌ ఇవ్వాలి మెగా అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ పోస్టర్స్‌, అప్‌డేట్స్‌ కూడా అదే స్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి కాలేదు అప్పుడే ఈ మూవీ ఓటీటీ డీల్‌ క్లోజ్‌ చేసుకుంది. కళ్లు చెదిరే నెంబర్‌ ఈ డీల్‌ కుదిరిందట. భారీ ధరకు ఓటీటీ రైట్స్‌ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్‌. డిజిటల్‌ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందట.

 

అయితే ఈ డీల్‌లో కొన్ని కండిషన్స్‌ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్‌ని బట్టి మరింత పెంచుతామని సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగులో, హిందీలో రిజల్ట్‌ బట్టి ఈ డీల్‌ ఉందని టాక్‌. కాబట్టి మొదటి నిర్మాతలకు రూ. 105 కోట్లు ఇచ్చాక.. రిలీజ్‌ తర్వాత మరింత మొత్తం అందనుందట. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పెద్ది సినిమాకు 50 శాతం షూటింగ్‌నే పూర్తి చేసుకుంది.

 

ఈ మధ్య షూటింగ్‌ పూర్తయిన సినిమాలకు ఓటీటీ బిజినెస్‌ కావడం లేదు. ది రాజాసాబ్‌, కన్నప్ప వంటి సినిమాలకు ఇంకా ఓటీటీ డీల్‌ కుదరలేదు. అలాంటి పెద్ది సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవ్వడం విశేషం. మల్టీస్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మే 27న ఈ చిత్రం విడుదల కానుంది.