Bhagavanth Kesari : గ్లోబల్ లయన్ బాలయ్య “భగవంత్ కేసరి” టీజర్ రిలీజ్.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అంటూ !
గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం "భగవంత్ కేసరి". ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది,
Bhagavanth Kesari : గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సైతం బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించడంతో ఈ మూవీపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇక నేడు బాలయ్య 63 వ పుట్టిన రోజు సందర్భంగా.. ముందుగానే చెప్పినట్టు ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మూవీ టీమ్. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్ లో “భగవంత్ కేసరి” టీజర్ లాంచ్ ని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ని గమనిస్తే.. మరోసారి బాలయ్య మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
ఈసారి కొత్తగా బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడబోతుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 75 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో బాలయ్య తనదైన డైలాగ్ లతో దుమ్ములేపారు. తెలంగాణ యాసలో, హిందీలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అందరినీ నెక్షక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్లను మరింత హైలైట్ చేసింది. ‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందని చూయిస్తడు.. మొండోడు ఆనికున్న ఒకేఒక్క గుండెని చూయిస్తడు’ అని చెప్పే డైలాగ్.. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది అంటూ చెప్పే మరో డైలాగ్ అదిరిపోయింది అని చెప్పాలి.
మొత్తంగా భగవంత్ కేసరి చిత్రంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ అందరికి అదిరిపోయే ట్రీట్ గ్యారెంటీ అని అనిల్ రావిపూడి చెప్పిన మాటలని నిజం చేస్తాడమే నమ్మకం ఈ టీజర్ చూస్తే కలుగుతుందని నందమూరి అభిమానులు చెబుతున్నారు. అదే విధంగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. బాలయ్య హీరోగా మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా చేయనున్నారు. చూడాలి మరి ఈ అనౌన్స్ మెంట్ కూడా డబుల్ బొనాంజాలా వస్తుందేమో అని.