Ram Charan: క్లింకారను అప్పుడే అందరికి చూపిస్తా: రామ్ చరణ్
Ram Charan in Unstoppable Show: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మరికొన్ని రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉంది. మూవీ టీం ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ ఛేంజర్ టీం నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి హాజరైంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండగా.. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆహా టీం రిలీజ్ చేసింది.
ఇందులో చరణ్ బాలయ్య అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నాడు. ఎంతో కాలంగా మెగా అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొన్న సందేహనికి ఈ షోతో క్లారిటీ దొరికింది. అదే మెగా మనవరాలు క్లింకారను ఎప్పుడు చూపిస్తారో ఈ సందర్భంగా చరణ్ రివీల్ చేశాడు. వచ్చి రాగానే చరణ్‌ను బాలయ్య తన ప్రశ్నలతో ఇరుకున పడేశాడు. షోకి వచ్చేముందు మీ అమ్మ, నానమ్మను నీ గురించి ఒకటి అడిగాను అనగానే.. ఏం అన్నారంటూ చరణ్ అడిగాడు. నా వల్ల కాదు చెప్పడమంటూ చరణ్‌ను టెన్షన్ పెట్టాడు. వాళ్ల కోరిక ఏంటో చెప్పను కానీ, నువ్వే చూడు అంటూ స్క్రీన్‌పై అంజనమ్మ, సురేఖ మాట్లాడుతున్న వీడియో ప్లే చేశారు.
చరణ్ నుంచి తమకు కావాల్సింది ఏంటో లెటర్‌లో పంపిస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆ లెటర్ ఇస్తూ ఏం అన్నారో తెలుసా.. అంటూ దానిని చరణ్ చేతికి ఇచ్చాడు బాలయ్య. అందులో ఈ ఏడాది 2025లో తమకు మనవడు కావాలి అని రాసి ఉంది. ప్రతి పండక్కి ఆవిడను కలవడం మిస్ అవ్వవు కదా? అని ఎవరో చెప్పకుండ చరణ్‌ను తికమక పెట్టాడు. ఉపాసన కాదయ్యా.. అనగా ఓహె అంటూ కూల్ అయ్యాడు. పార్టీకి వెళ్లాలంటూ ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి వెళ్తావ్ అంటూ చిరంజీవి, పవర్ కళ్యాణ్, నాగేంద్ర బాబు ఫోటోలు చూపిస్తూ అడిగాడు. వీరి ఎవ్వరతో కాదు.. మా మామయ్యతో వెళ్తాను.. అరవింద్ గారితో బాగుంటుందని సమాధానం ఇచ్చాడు.
అనంతరం చరణ్ నానమ్మ అంజనమ్మ… క్లింకారతో చరణ్ బాండింగ్ గురించి చెప్పారు. పొద్దున లెవగానే క్లింకారకు రెండు గంటల సమయం ఇస్తాడని, అన్నం తనే తినిపిస్తాడని చెప్పారు. వాళ్ల నాన్న తినిపించందే తను తినదు అని చెప్పగానే చరణ్ ఎమోషనల్ అవుతాడు. తను చాలా సన్నగా ఉంటుందని, తనకు అన్నం తినిపించడం కోసం ఇంట్లో ఉన్న గార్డేన్ చూట్టూ తిప్పుతాను అని చెప్పాడు. ఆ తర్వాత క్లింకారను తమకు ఎప్పుడు చూపిస్తున్నావు అని బాలయ్య, రామ్ చరణ్‌ను అడిగాడు. దీనికి తను నన్ను ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికి చూపిస్తాను” అని సమాధానం ఇచ్చాడు. ఇది మెగా అభిమానులతో పాటు చరణ్ ఫాలోవర్స్‌ని ఖుషి చేస్తుంది. దీంతో క్లింకార త్వరలో చరణ్ నాన్న అని పిలవాలని కోరుకుంటున్నామంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.