Balakrishna-Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు హీరో బాలకృష్ణ కాస్ట్లీ గిఫ్ట్.. ఎందుకో తెలుసా?

Nandamuri Balakrishna Presented a Costly Gift to Music Director Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ ప్రతిభకు గుర్తింపుగా బాలకృష్ణ ఖరీదైన పోర్షా కయెన్ కారును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పుకొచ్చారు. అలాగే వరుసగా 4 హిట్లు ఇచ్చినందుకు ప్రేమతోనే కారు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, ఈ కారు విలువ సుమారు రూ.2కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు.అయితే బాలకృష్ణ, తమన్ కాంబోలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- Second Single from Hari Hara Veeramallu: పవర్ స్టార్ ఫ్యాన్స్కి వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ – హరి హర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది!