Nandamuri Balakrishna: బాలయ్యకు పద్మ భూషణ్ పురస్కారం – చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్
Chiranjeevi and Pawan Kalyan Wishes Nandamuri Balakrishna: గణతంత్ర దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది తెలుగు వారికి ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. కళలలో విభాగంగాలో నటులు నందమూరి బాలకృష్ణ, హీరో అజిత్, నటి శోభనలకు మూడో అత్యతున్న పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. మరికొందరికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డుకు ఎన్నికైన బాలయ్య, అజిత్, శోభనలకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్య విషెస్ తెలిపారు. “ఐదు దశాబ్ధాలకుపైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందుపురం శాసన సభ్యుడిగా.. క్యానర్సర్ హాస్సిటల్ ఛైర్మన్‌గా ఎన్నో సేవలు అందించారు. ఆయనకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్న. అలాగే పద్మ అవార్డుకు ఎన్నికైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ట్విట్‌లో రాసుకొచ్చారు.
అదే విధంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. “అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన డా. నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే భూషణ్ అవార్డు గ్రహీతలైన నా ప్రియ మిత్రుడు నందమూరి బాలకృష్ణకు, హీరో అజిత్ కుమార్, నా రుద్రవీణ కోస్టార్ శోభనలకు నా హృదయపూర్వక శుభకాంక్షలు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహితలు అజిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మ అలాగే పద్మ అవార్డుల గ్రహితలైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మీరంత ఈ పురస్కారాలకు అర్హులు” అని రాసుకొచ్చారు.
Heartiest Congratulations on the conferment of prestigious Padma Vibhushan to Dr.D Nageswara Reddy garu for his illustrious services and Padma Bhushan award to dear friends #NandamuriBalakrishna, #AjithKumar, Sri Anant Nag , Sekhar Kapur Ji ,
my co star in Rudraveena #Sobhana…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2025