Last Updated:

Daaku Maharaj Collections: డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ – యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాలయ్య

Daaku Maharaj Collections: డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ – యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాలయ్య

Daaku Maharaj First Day Collections: నందమూరి బాలకృష్ణ నటించి లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కోల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అక్కడక్కడ సినిమా లాగ్ అనిపించిన, ఫస్టాఫ్ ఆడియన్స్ ఊహకు అందేలా ఉన్నప్పటికీ బాలయ్య వైల్డ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉందని, ఎమోషనల్ సీన్స్ ఆక్టటుకున్నాయంటూ రివ్యూస్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్, ఎమోషన్ తో డాకు మహారాజ్ కు తొలి రోజే హిట్ టాక్ పడింది. థియేటర్లకు ఆడియన్స్ క్యూ కట్టారు. దీంతో ఫస్ట్ డే మూవీ కలెక్షన్స్ సర్రైజ్ చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఒపెనింగ్ ఇచ్చిన డాకు మహారాజ్, ఓవర్సిస్ లోనూ దుమ్ముదులిపింది. అమెరికా బాక్సాఫీసు వద్ద తొలిరోజు బాలయ్య సినిమా అరుదైన రికార్డు సాధించింది. ఫస్ట్ డే మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి యూఎస్ బాక్సాఫీసును షేక్ చేసింది. తాజాగా మూవీ టీం దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చింది. అమెరికాలో డాకు మహారాజ్ వన్ మిలియన్ డాలర్లు క్రాస్ చేసిందంటూ మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ. 56 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది. దీంతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమైంది.

కాగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన బాలయ్యకు మరోసారి ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వరసగా నాలుగో హిట్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. డాకు మహారాజ్ హిట్ ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ లో నటించి ఆకట్టుకుంది. అలాగే పలు సీన్లలో మెరిసి వెండితెరపై అలరించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సౌజన్యలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డాకు మాహారాజ్ కు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.