Naga Chaitanya-Sobhita: ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే.. అసలు విషయం చెప్పేసిన చై

Naga Chaitanya and Sobhita Dhulipala Latest Interview: పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు నాగ చైతన్య-శోభిత. రీసెంట్‌గా ఈ కొత్త జంట వోగ్ మ్యాగజైన్‌కు కపుల్ ఫోటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా వోగ్‌తో చై-శోభితలు చిట్‌చాట్ కూడా చేశారు. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎలా మొదలైంది? గోడవలు వస్తే ఎవరు ముందు సారీ చెబుతారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేస్తారు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు?
ఇద్దరిలో తప్పు ఎవరిదైనా సారీ చెప్పేదెవరు? అని అడగ్గా.. నేనే చెప్తానంది శోభిత. అది విని చై ఆశ్చర్యపోయాడు. నువ్వు అసలు సారీలు, థ్యాంక్స్‌లు నమ్మవు కదా! అన్నాడు. అప్పుడు దీనికి శోభిత మాట్లాడుతూ.. ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అంది. దాంతో నవ్వేసిన చై తనే సారీ చెబుతానని ఒప్పుకున్నాడు. మొదట ఎవరూ ప్రపోజ్ చేశారు అన్న ప్రశ్నకు కూడా తానే అని సమాధానం ఇచ్చాడు చైతన్య. ఇద్దరిలో ఎవరు వంట బాగా చేస్తారని అడగగా.. తామిద్దరికి వంట రాదని చెప్పారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై తనకు హాట్ చాక్లెట్ మిక్స్ చేసిస్తాడంది శోభిత.
చైని అలా చూస్తుండిపోతా
దానికి చై స్పందిస్తూ.. అది వంట కిందకు రాదని, ప్రతి ఒక్కరికి ఉండే కనీస నైపుణ్యమని చెప్పుకొచ్చాడు చై. కానీ, నీకు అది లేదులే అంటూ భార్యకు సటైర్ వేశాడు. సినిమా చూస్తూ నిద్రపోయేది ఎవరన్న అడగ్గా.. శోభిత అని చెప్పాడు. తనకు సినిమా చూడమంటే చాలా ఇష్టమని చెప్పాడు. నేను ఒక 100 సినిమాలు చూస్తే అందులో శోభిత 5 నుంచి 10 సినిమా మాత్రమే చేసిందన్నాడు. దానికి శోభిత మాట్లాడుతూ.. చై సినిమాలు చూస్తే.. నాకు తనని చూడటం ఇష్టమని చెప్పింది.
ఇద్దరిలో ఎవరూ ఎక్కువగా నవ్వుతూ, నవ్విస్తుంటారని అడగ్గా.. శోభిత అని చెప్పారు. తను ఎప్పుడు చాలా సరదాగా ఉంటుందన్నాడు చై. తనకు ఫేమస్ హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుందని, అది తనకు హాబీ అని పేర్కొన్నాడు. కాకపోతే అనారోగ్యానికి గురైతే మాత్రం ఫుల్ డ్రామా క్వీన్ అయిపోతుందన్నాడు. ప్రాణం పోయినట్లే చేస్తుందని, కాస్తా అస్వస్థతగా అనిపించినా ప్రాణం పోయినట్టు చేస్తుంది.. నీరసంతో కిందపడిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్‌గా పెళ్లి తర్వాత తాము ఇచ్చిన ఫస్ట్ ఇంటర్య్వూ ఇదేనని, జంటగా మేము కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి కాబట్టి ఇది ఎప్పటికి మా మధుర జ్ఞాపకంగా ఉంటుందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వోగ్‌కి థ్యాంక్యూ చెప్పింది ఈ కొత్త జంట.