Gautam Ghattamaneni: గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాండిల్ లైట్ డిన్నర్! – గౌతమ్ ఘట్టమనేని యాక్టింగ్ వీడియో చూశారా?

Gautam Ghattamaneni First Acting Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని యాక్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ‘వన్ నేనొక్కడే’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.
ఆ తర్వాత గౌతమ్ మళ్లీ ఏ సినిమాలోను కనిపించలేదు. ఘట్టమనేని వారసుడిగా వెండితెరపై గౌతమ్‌ని చూడాలనేది అభిమానుల కోరిక. చూస్తుంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోంది. ఇటీవలె గౌతమ్ గ్రాడ్యుయేషన్‌ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని యాక్టింగ్ స్కూల్లో చేరి శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ యాక్ట్ చేసిన ఓ వీడియో బయటకు బయటకు వచ్చింది. న్యూయార్క్‌లోనే టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న గౌతమ్.. ఇందులో భాగంగా ఓ స్కిట్‌లో నటించాడు.
ఈ స్కిట్ లో భాగంగా గౌతమ్ ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్‌కి వెళ్లిన సీన్‌లో నటించాడు. మొదట నవ్వుతున్న గౌతమ్ ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఇందులో కోపం, ఎమోషన్స్‌ని బాగా చూపించాడు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఇది ఫుల్ ఖుష్ అవుతున్నాడు. గౌతమ్ తన యాక్టింగ్‌తో చిచ్చేశాడని, సూపర్ స్టార్ వారసుడా? మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పలు సోషల్ మీడియాలో ప్లాట్‌పాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక చూస్తుంటే ఈ ఘట్టమనేని వారసుడి వెండితెర ఆరంగేట్రం త్వరలోనే ఉండబోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#GautamGhattamaneni shines at NYU Tisch School of the Arts!
Gautam babu acted in mime created by his fellow students
Wishing him the best on this creative journey! ✨🎭 @urstrulyMahesh pic.twitter.com/iPq6DrfDuk
— SSMB EMPIRE FC 🦁 (@ssmb_freaks) March 21, 2025