Last Updated:

Megastar Chiranjeevi : నాని “దసరా” టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి.. రిప్లై ఇచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Megastar Chiranjeevi : నాని “దసరా” టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి.. రిప్లై ఇచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల

Megastar Chiranjeevi : నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా నిలిచింది.

ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. 10 రోజుల్లో ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టించింది. అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటుంది. 2M కలెక్షన్స్ అందుకొని నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. అయితే మరోవైపు నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు.

కాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూశాడు. దీంతో చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. లేటెస్ట్ గా దసరా సినిమా చూసి “బ్రిల్లియంట్ ఫిల్మ్ చేశారు, నాని మేకోవర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసావ్, కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా చేశాడు అనే విషయం ఆశ్చర్యపరిచింది, అతని ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని అభినందించకుండా ఉండలేము, మహానటి కీర్తి సురేష్ వావ్ అనిపించేలా యాక్ట్ చేసింది, కొత్త కుర్రాడు దీక్షిత్ కూడా బాగా చేశాడు, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ రాకింగ్ గా ఉంది” అంటూ పేరు పేరునా దసరా సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రతి ఒక్కరినీ చిరు స్పెషల్ మేషన్ చేసి మరీ అభినందించాడు. కంగ్రాట్యులేషన్స్ నాని అండ్ ఎంటైర్ టీం అంటూ ట్వీట్ చేశాడు.

చిరంజీవి ట్వీట్‌కి నాని స్పందించారు. ‘మీరెప్పటికీ మా మెగాస్టారే సార్. వెండితెర మీద మాత్రమే మెగాస్టార్ కాదు.. సినిమా కోసం, సినిమా వాళ్ల కోసం ఎల్లప్పుడూ నిలబడే మెగా హార్ట్ మీ సొంతం’ అని నాని రిప్లై ఇచ్చాడు.

ఈ ట్వీట్ చిరు పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల “ఎగురుతున్నా, థాంక్యూ బాస్” అంటూ రిప్లై ఇచ్చాడు. తన చిన్నప్పుడు చిరు ఐకానిక్ స్టెప్ అయిన ‘వీణ స్టెప్’ని వేసిన ఫోటోని కూడా శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు.

 

అంతకు ముందు ప్రభాస్, మహేష్ బాబు కూడా దసరా సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ల  విషయం మీడియాలో వైరల్ గా మారింది.