Manchu Vishnu: మిస్సైన హార్డ్ డిస్క్ వాళ్ల దగ్గరే ఉంది – అడిగిన ఇవ్వడం లేదు : విష్ణు కామెంట్స్

Manchu Vishnu Comments on Hard Disk Missing: ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు విష్ణు మరోసారి స్పందించారు. పోయిన హార్డ్ డిస్క్ ఇంకా తన వద్దరు రాలేదన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటిస్తోన చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాని విష్ణు తండ్రి మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విష్ణు ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలో కన్నప్ప హార్డ్ డిస్క్ మాయంపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ కోసం ఎనిమిది వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయని చెప్పాడు. ముంబైలో ఉన్న 8 వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ‘కన్నప్ప’ కోసం పని చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్‌లైన్ ద్వారా మూవీ కొంత భాగాన్ని పంపించింది. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్‌లోడ్ చేసి పంపించింది. ముందు జాగ్రత్తగా వాళ్లు ఓ హార్డ్ డిస్క్ కూడా పంపారు. అయితే ఆ పార్సిల్ ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు.
నాన్న గారి ముగ్గురు పిల్లలకు సంబంధించిన ఎలాంటి పార్సిలైన ఫిలింనగర్‌లోని నాన్న ఇంటికే వస్తుంది. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్నగారి ఇంటిదే ఉంటుంది. మా ముగ్గురిలో ఎవరికి పార్సిల్ వచ్చిన అక్కడి మేనేజర్లు ఆయా పేర్లను బట్టి వారికి అందజేస్తారు. అలాగే కన్పప్ప హార్డ్ డిస్క్ కూడా ఆ ఇంటికే వచ్చింది. అప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే ఆవిడకు తీసుకోని చెప్పారట. ఆవిడ దాన్ని తీసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత మాకు తెలిసిందేంటంటే.. రఘు, చరితలు ఇద్దరు మనోజ్‌తో ఉంటారట.
మనోజ్ ఇంట్లో పని చేస్తారని తెలిసింది. ప్రస్తుతం వారు అక్కడ పని చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ, మనోజ్‌తో ఉంటారనే విషయం మాత్రం తెలుసు. హార్డ్ డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసిందే. పోలీసు కంప్లైంట్స్ ఇచ్చాం. అప్పటికీ మధ్యవర్తితో చెప్పి పంపాము. అయినా ఇవ్వమన్నార. దీంతో పోలీసులను ఆశ్రయించాం. పోలీసులకు మొత్తం వివరించాం. వాళ్లకు అంత తెలుసు. వాల్లు విచారణ చేసి పూర్తి వివరాలు చెబతున్నామన్నారు. ఇప్పటివరకూ హార్డ్ డిస్క్ మాత్రం నా చేతికి రాలేదు. దానికి పాస్‌వర్డ్ ఉంది కాబట్టి సేఫ్ అనుకుంటున్నా. కానీ, ఏ పాస్‌వర్డ్ అయినా.. 99 శాతం మాత్రమే సేఫ్, 100 శాతం సేఫ్ కాదు కదా” అని మనోజ్ చెప్పుకొచ్చాడు.