Published On:

Court Sentences 2 Congress MLAs: 11 ఏళ్ల నాటి కేసు.. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష

Court Sentences 2 Congress MLAs: 11 ఏళ్ల నాటి కేసు.. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష

Jaipur District Court Sentences 2 Congress MLAs: సుమారు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు తొమ్మిది మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వారందరికీ బెయిల్ మంజూరు చేసింది. తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది. 2014 ఆగస్టు 13వ తేదీన జైపూర్‌లోని రాజస్థాన్ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద జేఎల్‌ఎన్ మార్గాన్ని సుమారు 20 నిమిషాలు నిరసనకారులు దిగ్బంధించారు. చట్టవిరుద్ధంగా ప్రజారహదారిని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2016 ఆగస్టు 11న ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

 

కేసుపై 11 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. జైపూర్ జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు 9 మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష విధించింది. వారందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీర్పు, శిక్ష నిలిపివేతపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది.

 

మరోవైపు జైలు శిక్ష పడిన తొమ్మిది మందిలో లడ్నన్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనీష్ యాదవ్, జోత్వారా అసెంబ్లీ స్థానానికి చెందిన మాజీ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి ఉన్నారు. దోషిగా నిర్ధారించిన ఇద్దరు కాంగ్రెస్ నేతల అసెంబ్లీ సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుత చట్టం ప్రకారం జైలు శిక్ష రెండేళ్లకు మించితేనే ఎంపీ, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది.

 

ఇవి కూడా చదవండి: