Donald Trump Loves Pakistan: ‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్థాన్’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
‘I Loves Pakistan’ Said by US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుదేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ కాల్‌లో ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ కొనియాడారు.
పాక్ అంటే తనకు ఇష్టమని, మోదీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మంగళవారం రాత్రి మోదీతో మాట్లాడినట్లు చెప్పారు. తాము భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. పాక్-భారత్‌ల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని తేల్చి చెప్పాడు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని కొనియాడారు. పాక్ వైపు నుంచి మునీర్, భారత్ తరఫున మోదీ తదితరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారని పేర్కొన్నారు. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని మీడియాతో పేర్కొన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నాడు. ట్రంప్ ప్రకటనపై స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ మొదటిసారిగా దీనిపై స్పందించారు. రెండుదేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.