Published On:

Kamal Haasan Tweet: కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్‌ ట్వీట్‌.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌

Kamal Haasan Tweet: కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్‌ ట్వీట్‌.. వైరల్‌ అవుతున్న పోస్ట్‌

Kamal Haasan tweet on M Karunanidhi Birth Anniversary: కన్నడ భాషపై విశ్వనటుడు కమల్ చేసిన చేసిన కామెంట్స్‌ ఇప్పటికే హాట్‌టాపిక్‌గానే ఉన్నాయి. కమల్‌ తమ భాషను అవమానపరిచారంటూ కన్నడీగులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ వచ్చాయి. లేని పక్షంలో ఆయన చిత్రం థగ్‌లైఫ్‌ని కర్ణాటకలో బ్యాన్‌ చేస్తామని హెచ్చరించారు. అయినా కమల్‌ తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు.

 

తాను ఏ తప్పు చేయలేదని, తాను క్షమాపణలు చెప్పేదే లేదన్నారు. ఇక తన సినిమా థగ్‌లైఫ్‌ని కర్ణాటకలో నిషేధించడంతో ఆయన ఆ రాష్ట్ర హైకోర్టు ఆశ్రయించారు. తన సినిమాను కర్ణాటకలో విడుదల చేసేలా చేయాలని ఆయన కోరారు. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు కమల్‌ తీరును తప్పుబట్టింది. మీరేమైన చరిత్ర కారులా.. భాషపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించింది. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు సైతం ఆయనకు వారించింది. క్షమాపణలు చెప్పాల్సిందే అని తీర్పు ఇచ్చింది.

 

దీంతో కమల్‌ తాను క్షమాపణలు చెప్పను.. థగ్‌ లైఫ్‌ని కర్ణాటకు విడుదల చేయను అంటూ తేల్చేశారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి ఆయన రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు భాష వివాదం నడుస్తున్న వేళ కమల్‌ తమిళంలో ఓ ట్వీట్‌ చేశారు. ఈ రోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం కరుణానిధి జయంతి. ఈ సందర్భంగా కమల్‌ ఆయనకు నివాళులు అర్పిస్తు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కరుణానిధి సేవలను కొనియాడుతూ ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.

 

“కలైంజ్ఞర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నా. ఆయన జీవితంలో మొత్తం తమిళ భాష, తమిళ కళ, తమిళ రాష్ట్ర అభివృద్ధికి అంకితం చేశారు. తమిళ కళ సంక్షేమానికి అనితర కృషి చేసిన అసమాన నాయకుడికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి నేను సంతోషిస్తున్నా” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ దక్షిణాది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఓ వైపు కన్నడ భాషపై ఆయన వ్యాఖ్యలను కన్నడీగులు తప్పుబడుతున్న వేళ.. ఆయన తమిళ భాష నొక్కి చెబుతూ తమిళంలో ట్వీట్‌ చేయడం ఆసక్తిని సంతరించుకుంది.