Vishal – Sai Dhanshika: పెళ్లి ప్రకటన వచ్చేసిందోచ్.. సాయి ధన్సికతోనే విశాల్ పెళ్లి.. ముహుర్తం కూడా ఫిక్స్..!

Vishal and Sai Dhanshika Announce Their Wedding: అనుకున్నదే నిజమైంది. హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సికలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరు జంటగా తమ పెళ్లిపై ప్రకటన చేశారు. కాగా విశాల్ పెళ్లి వార్తలు కొన్ని రోజులుగా హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా విశాల్-ధన్నిక పెళ్లి వార్తలు కోలీవుడ్ ఊపందుకున్నాయి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందనే వార్తలు కూడా వినిపించాయి. అనుకున్నట్టుగానే వీరిద్దరు పెళ్లి ప్రకటనతో వచ్చారు.
సాయి ధన్సిక నటించిన యోగిదా మూవీ కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది. దీనికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి ధన్సిక మాట్లాడుతూ.. విశాల్ చూస్తే బేబీ ఏమైంది.. చెప్పేయన అంటూ సిగ్గు పడుతూ మాట్లాడింది. ఇక విశాల్ కూడా ఆమెను చూస్తు ముసిముసిగా నవ్వుతున్నాడు. ‘అవును.. విశాల్ నేను మంచి స్నేహితులం. మాది 15 ఏళ్ల స్నేహబంధం. ఇప్పుడు కలిసి నడవాలనుకుంటున్నాం. ఆగష్టు 29న మా పెళ్లి ముహుర్తం కూడా పెట్టేసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక విశాల్ కూడా ధన్సిక పెళ్లిపై ప్రటకన చేశాడు. ధన్సిక తన జీవితంలోకి రావడం అదృష్టమన్నారు. ధన్సిక అద్భుతమైన వ్యక్తి. చివరిక దేవుడు మన కోసం అత్యుత్తమైనదాన్ని దాచిపెడతాడు.
— Moorthy (@Moorthy1796707) May 19, 2025
అవును ధన్సికతో నేను పెళ్లి చేసుకోబోతున్నాం. తను నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం. మేమిద్దరం కలిసి ప్రేమపూర్వకమైన జీవితాన్ని పంచుకోబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ధన్సిక నటిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రకటన ఇటూ విశాల్.. అటూ ధన్సిక అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి వార్త కోలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. కాగా గతంలో విశాల్‌కు అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది పెళ్లి వరకు వెళ్లలేదు. కొన్ని రోజులు వారిద్దరు ఎంగేజ్‌మెంట్‌ని బ్రేక్ చేసుకున్నారు. కాగా సాయి తెలుగులో వచ్చిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
#SaiDhanshika:
"Enna Baby Solliralama. Me & #Vishal going to marry on Aug 29th. We recently started talking with each other & got into love. I just want Vishal to be happy & I love you
"pic.twitter.com/F1j8bw3XA5
— AmuthaBharathi (@CinemaWithAB) May 19, 2025