Raashii Khanna Injured: ముక్కులో నుంచి రక్తం.. షూటింగ్‌లో గాయపడ్డ రాశీఖన్నా.. ఫోటో వైరల్

Actress Raashi Khanna Injured in ‘Farzi 2’ series Shooting: హీరోయిన్ రాశీఖన్నాకు గాయాలయ్యాయి. షూటింగ్‌లో ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. తన ముక్కులోంచి రక్తం, చేతికి గాయాలైన ఫోటోని షేర్ చేసి షాకిచ్చింది. దీంతో ఆమె ఏమైందా అని అభిమానులంత ఆందోళ చెందుతున్నారు. ముక్కు, చేతికి రక్తపు గాయాలతో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. దీనికి “కొన్ని పాత్రలు అడగవు. డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయం.. ఎప్పుడైతే మీరు తుఫాన్‌గా మారతారో.. ఉరుములకు బెనకరు. త్వరలో వస్తుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇది తన కొత్త సినిమా ప్రమోషన్ అని అర్థమైంది. అయితే ఆమెకు ఇవి నిజమైన గాయాల, షూటింగ్ భాగంగా పెట్టిన గాయాల అనేది క్లారిటీ లేదు. కానీ, ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం తనకు గాయమైనట్టు రాశీ ఖన్నా పేర్కొంది. అయితే వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఫర్జీ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ రాశీ లీడ్ రోల్లో నటిస్తోంది. యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా.. సైతం పులు యాక్షన్ సన్నివేశాల్లో నటించనుంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో భాగంగానే ఆమె గాయాలైనట్టు తెలుస్తోంది.
కాగా రాశీ ఖన్నా ఈ మధ్య తెలుగులో కనిపించి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేవనే విషయం తెలిసిందే. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె బెంగాల్ టైగర్, జోరు, జీవమ్, సుప్రీం, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ వంటి పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోల సరసన నటించిన ఆమె ప్రస్తుతం ఆఫర్స్ లేక బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఇక తమిళంలో ఇటీవల అరణ్మణై అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం సౌత్, నార్త్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకపోతున్నాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- War 2 Teaser Out: ఎన్టీఆర్ బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది.. అదిరిపోయిన ‘వార్ 2′ టీజర్’, తారక్ లుక్ మామూలుగా లేదు..!