Published On:

Junior First Song: మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ కొడుకు కిరీటి హీరోగా ‘జూనియర్‌’.. తొలి సాంగ్‌ విడుదల!

Junior First Song: మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ కొడుకు కిరీటి హీరోగా ‘జూనియర్‌’.. తొలి సాంగ్‌ విడుదల!

Kireeti Junior Movie First Single Release: కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి వెండితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అతడు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్‌’. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా.. జెనీలియా, కన్నడ లెజెండరీ నటుడు వి. రవిచంద్రన్‌ కీలక పాత్ర పోషించారు. సుధీర్ఘ విరామంతో తర్వాత జెనీలియా రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

 

కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో జూన్‌ 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ఈ సినిమాలోని ‘లెట్స్‌ లవ్‌ దిస్‌ మూమెంట్‌’ అనే పాటను రిలీజ్‌ చేశారు. రాక్‌స్టార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పాటను జస్పిత్రి జాజ్‌ ఆలపించారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో కిరిటీ రెడ్డి మాట్లాడుతూ.. “జూనియర్‌ చాలా మంది సినిమా. ఇందులో ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. షూటింగ్‌ టైంలో నాకు గాయమైంది. కోలుకోవాలనికి ఏడాది పట్టింది. అందుకే మా సినిమా రిలీజ్‌ ఆలస్యమైంది” అని చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి: