Manchu Manoj Vs Manchu Vishnu: ఆస్తి గొడవ కాదు – నా సినిమాకు భయపడి ‘కన్నప్ప’ వాయిదా వేసుకున్నాడు.. అదే కోపంతో..

Manchu Manoj Comments About Dispute With Vishnu: తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు అందించేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు మంచు మనోజ్. బుధవారం జల్‌పల్లి నివాసం వద్ద మనోజ్ నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. కాగా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు వార్తల్లో నిలుస్తున్నాయి. మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనరేటర్‌లో చక్కెర పోయించడం, పవర్ కట్ వరకు ఇలా విష్ణు, మనోజ్‌పై రివేంజ్‌కు దిగాడు.
మనోజ్ నిరసన
ఇలా కొంతకాలంగా మంచు ఫ్యామిలీ గొడవలు వార్తల్లో నిలుస్తాయి. ఈ మధ్య సైలెంట్ అయిన మంచు వార్ మళ్లీ రచ్చకెక్కింది. కూతురు పుట్టిన రోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లిన మనోజ్‌కు తిరిగి వచ్చేసరికి అతడి ఇంట్లోని వస్తువులు దొంగలించారు. కార్లు ఎత్తుకెళ్లారు. ఇదంత తన అన్నయ్య మంచు విష్ణు పనే అని మనోజ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక బుధవారం తనని ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని జల్‌పల్లిలోని మంచు టౌన్ వద్ద ఆందోళన చెపట్టాడు మనోజ్. తన అన్న విష్ణు కోసం తాను ఎంతో చేశానని, చివరి అతడి కెరీర్ కోసం తాను లేడీ గెటప్ వేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.
విష్ణు కోసం ఎన్నో త్యాగాలు చేశా
“నా కుటుంబం నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బయట ప్రొడక్షన్‌లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయాల్సిందేననే వారు. నేను హిట్ కొట్టి సంపాదించిన డబ్బు విష్ణు ప్రొడక్షన్ హౌజ్‌లో పెట్టించేవారు. విష్ణుని హీరోగా నిలబెట్టడం కోసం నేను ఎన్నో త్యాగాలు చేశారు. చివరి లేడీ గెటప్ కూడా వేశాను. వాళ్ల కోసం ఎంతో గొడ్డు చాకిరీ చేశా. అయినా ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. సరే ఇక్కడ వెండితెరపై చూసుకుందామని కన్నప్పకు పోటీకి నా భైరవం మూవీ రిలీజ్ చేస్తున్నాను. దానికి భయపడి విష్ణు కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు. ఈ వయసులో నా తల్లిదండ్రులకు ఈ తలనొప్పులు అవసరమా? ప్రశాంతంగా కూర్చోని మాట్లాడుకుందామన్న విష్ణు వినడం లేదు” అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
ఇది ఆస్తి గొడవ కాదు
“పరిస్థితులు బాగా లేవని పాప్ పుట్టిన రోజునే కూడా ఇక్కడ జరుపుకోలేదు. ఈ పరిస్థితులకు దూరంగా పాపతో కాస్తా సంతోషంగా స్పెండ్ చేద్దామని మేమంత రాజస్థాన్ వెళ్లాం. అది తెలిసి విష్ణు ఇదంతా ప్లాన్ చేశాడు. తెల్లవారుజామున తన అనుచరులతో ఇంటికి వచ్చి కార్లు తీసుకువెళ్లాడు. నా సెక్యూరిటీపై దాడి చేశారు. కమిషనర్ ఇచ్చి బైండోవర్‌ని ఎన్నోసార్లు దాటారు. నేను తప్పు చేశానని, ఆస్తి అడిగాను అనడగానికి ఒక్క ప్రూఫ్ చూపించమనండి ఇప్పుడు అందరి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతాను. చోరి గురించి పోలీసులకు చెబుతున్నా యాక్షన్ తీసుకోవడం లేదు. నా సెక్యూరిటీని కొట్టారు. అతడు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
విష్ణు నా ఇంట్లోకి వచ్చిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి చూపించరు. సీసీ కెమెరాలు బయటపెడితే ఇక్కడే సగం గుండుతో తిరుగుతా. ఇదంతా కావాలనే చేస్తున్నారు. ఇదంతా నా జుట్టును విష్ణు చేతికి ఇవ్వాలని చూస్తున్నారు. అలా జరగకపోవడంతో నా మీద కుళ్లుతో ఇదంతా చేస్తున్నాడు. నా ఇంటికి నేను వెళ్లడానికి ఆర్డర్ కావాలి అంటున్నారు. మోహన్ బాబు చెబితే ఇంట్లోకి పంపిస్తామంటున్నారు. కోర్టు నోటీసులతో వచ్చినా లోపలకు పంపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే. నాకు న్యాయం జరిపించండి. ఈ సమస్యను పరిష్కరించాండి” అని మనోజ్ విజ్ఞప్తి చేశారు.