Kamal Haasan Letter to KFCC: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు కమల్ లేఖ
Kamal Haasan write Letter Karnataka Film Chamber Of Commerce: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ లేఖ రాశారు. కన్నడపై తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే తాను ఈ విషయంలో క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కమల్ తన లేఖలో తన వ్యాఖ్యల వెనక ఉన్న అంతర్యాన్ని వివరించారు.
“కన్నడ భాషపై నేను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు తప్పుగా అర్థం చేసుకోవడం బాధ ఉంది. తమిళ్, కన్నడ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చేప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం. ఆ భాషను తక్కువ చేయడం కాదు. మనమంతే ఒక్కటే.. ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతర్యం. తమిళ్, కన్నడ భాషలను నేను ఎంతో గౌరవిస్తాను. అంతేకాదు తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం భాషలతో నాకు ఎంతమంచి అనబంధం ఉంది. నేను ఏ భాషను తగ్గించను. సినిమానే నా భాష. అన్ని భాషలపై నాకు అభిమానం ఉంది. సినిమానే ప్రజలను ఏకం చేస్తుంది. ప్రేమతోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను” అని పేర్కొన్నారు.
కాగా ఆయన సినిమా థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి రాజ్‌కుమార్‌కు తను మంచి అనుబంధం ఉందని, శివరాజ్ కుమార్‌కు తాను ఓ తండ్రిలాంటి వాడినన్నారు. ఆ కుటుంబానికి తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ.. కన్నడ భాష అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. అదే క్రమంలో తామంత ఒక్కటే అని చెబుతూ.. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలను కన్నడీగులు, కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు తప్పుబడుతున్నారు. కన్నడ భాషను ఆయన అవమానించారని, కమల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఆయన థగ్ లైఫ్ చిత్రాన్ని ఇక్క నిషేధిస్తామని చెప్పారు. ఈ వ్యవహరంలో కమల్ సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం కమల్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. మీరు ఎంత పెద్ద నటులైన.. ప్రజల మనోభవాలను దెబ్బతీసేలా మాట్లాడే హక్కు మీకు లేదని, మీరేమైన చరిత్రకారుడా? భాష గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేసిది. క్షమాపణలు చెబితే ఏముందని ఆయనను ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు ప్రభావం చూపించాయని, క్షమాపణలు చెప్పాల్సిందే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహరంలో కర్ణాటక కోర్టు తీర్పు వెలువడిన కాసేపటికే ఆయన కేఎఫ్‌సీసీకి ఇలా లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కన్నడ ఫిలిం ఛాంబర్‌కు లేఖ రాసిన కమల్ హాసన్@ikamalhaasan #kfcc #ThuglifeFromJune5 #thuglife pic.twitter.com/GC2R6sw0iB
— Rajababu Anumula (@Rajababu_a) June 3, 2025