Published On:

The Raja Saab Teaser Date: ది రాజాసాబ్‌ నుంచి రెండు బిగ్‌ అప్‌డేట్స్‌.. మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే..?

The Raja Saab Teaser Date: ది రాజాసాబ్‌ నుంచి రెండు బిగ్‌ అప్‌డేట్స్‌.. మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే..?

Prabhas The Raja Saab Teaser out on June 16th 10:52 AM: డార్లింగ్ ఫ్యాన్స్‌ అంత ఎప్పుడెప్పుడ అని ఆసక్తిక ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. ప్రభాస్‌ ది రాజా సాబ్‌ మూవీ అప్‌డేట్స్‌ కోసం అభిమానులంత కళ్లు కాయాలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మేలో టీజర్‌ అప్‌డేట్‌ ఇస్తామని డైరెక్టర్‌ మారుతి తెలిపారు. కానీ, అప్‌డేట్‌ ఏం రాలేదు. దీంతో ఫ్యాన్స్‌ అంత అసహనం చూపిస్తున్నారు. ది రాజాసాబ్‌ అప్‌డేట్‌ ఎప్పుడ్రా బాబూ అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. మూవీ టీజర్‌ రిలీజ్‌తో పాటు మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. జూన్‌ 16న టీజర్‌ పేలబోతుందంటూ మూవీ టీం క్రేజీ అప్‌డేట్‌ వదిలింది. అలాగే సినిమా డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంత పండగ చేసుకుంటున్నారు. జూన్‌ 16న వచ్చే టీజర్‌ ఏ రేంజ్‌లో పేలుతుందాని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ పలు భారీ ప్రాజెక్ట్స్‌, దిగ్గజ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాంటి టైంలో ఆయన డైరెక్టర్‌ మారుతితో సినిమా అనగానే అంతా షాక్‌ అయ్యారు. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలైంది, ఎంతవరకు షూటింగ్‌ అయ్యిందనేది ఏ ఒక్క క్లారిటీ లేదు.

 

అయితే ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ప్రభాస్‌ పోస్టర్‌ భారీ రెస్పాన్స్‌ వచ్చింది. మారుతి నుంచి ఈ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేయలేదని, అంటే డార్లింగ్‌ ఫ్యాన్స్‌ కోసం భారీగా ప్లాన్‌ చేశారని ఫ్యాన్స్‌ మారుతిని నమ్ముతున్నారు. అప్పటి ది రాజాసాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదోక రొమాంటికి కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌ డ్యుయల్‌ రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే.