Published On:

Pawan Kalyan: కమల్ హాసన్ కు పవన్ కల్యాణ్ విషెస్

Pawan Kalyan: కమల్ హాసన్ కు పవన్ కల్యాణ్ విషెస్

Pawan Kalyan wishes To kamal Haasan: సీనియర్ యాక్టర్ కమల్ హాసన్ ఆస్కార్ అవార్డ్స్ కమిటీకి సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో భారీతయ సినిమా రంగంలో అనేక అవార్డులు, జాతీయ, రాష్ట్ర ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నకమల్ హాసన్ కి ఈ గౌరవం దక్కడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు స్వాగతిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కమల్ హాసన్ ను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన క్షణం అంటూ పవన్ సంతోషం వ్యక్తం చేశారు.

కమల్ హాసన్ కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి ఫిలిం మేకర్స్ అన్నారు. రచన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు సహా సినిమాలోని ప్రతి అంశంపై ఆయనలో ఎంతో నైపుణ్యం ఉంది. కమల్ హాసన్ ఆరు దశాబ్దాల విశిష్ట కెరీర్ ను ప్రస్తావిస్తూ, పవన్ ఆయనను నిజమైన కళాఖండంగా అభవర్ణించారు. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ సినిమా సహా ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్నిచూపిందంటూ పవన్ పేర్కొన్నారు.

 

కమల్ హాసన్ తో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులలో ఒకరిగా ఎంపికయ్యారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన 2025 సభ్యత్వ జాబితాలో చోటు దక్కడం విశేషం. భారతీయ సినీ రంగారానికి ఇది మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు.

ఇవి కూడా చదవండి: