Thug Life: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన థగ్ లైఫ్

Thug Life OTT Streaming: సీనియర్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన భారీ మూవీ థగ్ లైఫ్. త్రిష కథానాయికగా, నటుడు శింబు కీలక పాత్రలో నటింటిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ మూవీకి థియేటర్లలో ఆశించినంత స్పందన రాకపోవడంతో మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వగానే ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా థగ్ లైఫ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.
కాగా సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. సినిమాని థియేటర్స్ లో విడుదల చేసిన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ మూవీకి నెగెటీవ్ టాక్ రావడంతో నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. కర్ణాటకలో ఈ మూవీ బ్యాన్ కాగా, అక్కడ ఉంటున్న ఫ్యాన్స్ ఈ మూవీని చూడలేకపోయారు. కాగా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోకు ఉన్న క్రేజ్ కు తగిన కథ, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వలనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిందని పలువురు అనుకుంటున్నారు. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని మూవీ టీమ్ భావిస్తోంది.