Published On:

Delhi Double Murder: అరిచిందని తల్లి కొడుకును చంపిన పనిమనిషి

Delhi Double Murder: అరిచిందని తల్లి కొడుకును చంపిన పనిమనిషి

Delhi Double Murder: ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమానురాలితో పాటు అమె కుమారుడిని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని లాజ్‌పత్‌ నగర్‌లో చోటుచేసుకుంది. కోపంతో అరిచినందుకు యజమానురాలు రుచికా సివానితో పాటు కొడుకు క్రిష్‌ని పనిమనిషి గొంతు కోశాడు. అనంతరం ఇంటి నుండి పారిపోయాడు. రుచిక భర్త కుల్దీప్ సవానీ పని నుండి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి తలుపు మూసి ఉండడంతో భార్యను పిలిచాడు. ఎంత సేపటికి భార్య తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చింది.  మెట్లతో పాటు గేటు వద్ద రక్తపు మరకలు కనిపించడంతో భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన భార్య, కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

 

కుల్దీప్ సవానీ ఫిర్యాదుతో పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బెడ్ రూమ్‌లో మంచం పక్కన భార్య రుచిక శవం కనిపించింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పదోతరగతి చదువుతున్న ఆమె కొడుకు క్రిష్.. బాత్రూమ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. లాజ్‌పత్‌ నగర్‌లో రుచికకు గార్మెంట్ షాపు ఉంది.

 

కేసు విచారణలో భాగంగా డ్రైవర్, హెల్పర్‌గా పనిచేస్తున్న ముకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారణలో ముకేశ్ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. తనను యజమానురాలు రుచికా తిట్టడం వల్లే ఆమెను, ఆమె కొడుకును హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితుడు ముకేశ్ సొంత రాష్ట్రం బీహార్ కాగా.. ఢిల్లీలోని అమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పిటల్ తరలించారు. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించాయి. కేసు విచారణలో భాగంగా సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: