Published On:

Diogo Jota: రోడ్డు ప్రమాదంలో స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మృతి

Diogo Jota: రోడ్డు ప్రమాదంలో స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మృతి

Portugal Football Player Died: పోర్చుగల్ కి చెందిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పెయిన్ లోని జమోరాలో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచాడు. ప్రమాదంలో జోటా సోదరుడు ఆండ్రే ఫిలెపి కూడా ప్రాణాలు కోల్పోయాడు. లాంబోర్గిని కారులో వెళ్తున్న సోదరులు.. మరో కారను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో టైర్ పేలింది. దీంతో కారులో మంటలు వ్యాపించి ఇద్దరూ సజీవదహనమయ్యారని డాక్టర్లు చెప్పారు.

 

కాగా డియాగో జోటా రెండు వారాల క్రితమే (జూన్ 22) పెళ్లి చేసుకున్నాడు. రూటో కార్డోసోను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ జంటకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతేడాది లివర్ పూల్ జట్టు ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో జోటా కీలక ప్లేయర్. అలాగే పోర్చుగల్ జాతీయ జట్టు తరపున కూడా జోటా ఆడాడు. యూఈఎఫ్ఏ టోర్నీని పోర్చుగల్ గెలవడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. ఫార్వర్డ్ ప్లేయర్ గా జోటాకు మంచి రికార్డ్ ఉంది.

 

ఇవి కూడా చదవండి: