Published On:

Telangana Police Recruitment Board: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ!

Telangana Police Recruitment Board: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ!

Telangana Police Recruitment Board: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. త్వరలోనే తెలంగాణలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో దాదాపు 12వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్న సమాచారం. ఈ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటీఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ రానుంది.

 

రాష్ట్రంలో పోలీసుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు 12 వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

 

అంతకుముందు, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వం దాదాపు 35వేల పోలీసులను రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు పూనుకుంది. కానీ ఒకేసారి సాధ్యంకాకపోవడంతో విడతల వారీగా పోస్టులను భర్తీ చేసుకుంటూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా పోస్టుల భర్తీ నిలిచిపోయింది. పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చివరిసారిగా 2022లో రిక్రూట్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

 

అదే ఏడాది సెలెక్ట్ అయిన ఎస్ఐ, కానిస్టేబుల్స్‌లకు కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. మొత్తం 17వేల పోస్టులను భర్తీ చేసి రికార్డు నెలకొల్పింది. అయితే మల్లీ భారీ సంఖ్యలో పోలీసు రిక్రూట్ మెంట్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో దాదాపు 12వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును పెంచింది. అంతకుముందు 58 ఉండగా.. 61 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 2021లో పదవి విరమణ పొందాల్సిన వారు 2024 మార్చి వరకు విధుల్లో కొనసాగారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చాలామంది పదవి విరమణ పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే భర్తీ చేయనుంది.