Home / Hyderabad police
అంతర్రాష్ట్ర పిల్లల అక్రమరవాణా ముఠా గుట్టును హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసులు రట్టు చేసారు. . ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు.
ఇకపై హైదరాబాద్ లో వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలంటున్నారు పోలీసులు. నగరంలో వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు..
హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా అనుకొన్నది వారు చేసేస్తున్నారు. దీంతో రెండు పబ్బుల పై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు.
బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్ర పన్నిన జాహిద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ఉగ్రవాద గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా సమాచారం.
మద్యం మత్తులో స్విగ్గీ బాయ్ పై దాడికి దిగారు. పిడిగుద్దులతో చితకొట్టారు. వెంటపడి తరిమారు. చివరికి పోలీసుల చేతికి చిక్కిన ఆ ఘటన హైదరాబాదు చైతన్యపురి పిఎస్ పరిధిలో చోటుచేసుకొనింది
అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది. అమిత్ షా కాన్వాయ్ ని తెరాస నేత కారు అడ్డగించింది.
డు పాతబస్తీలో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు.