Rana Daggubati: కమల్ హాసన్ ‘కన్నడ’ వివాదం.. అసహనం వ్యక్తం చేసిన రానా దగ్గుబాటి
Rana Daggubati Reacts on Language Row in South Over Kamal Haasan: కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడీగులు, అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్స్ వస్తున్నాయి. కానీ కమల్ మాత్రం తాను తగ్గేదే లే అంటున్నారు. క్షమాపణలు చెప్పకపోతే యన చిత్రం థగ్ లైఫ్‌ని కర్ణాటక్లో నిషేధిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టును కూడా ఆశ్రయించింది.
థగ్ లైఫ్ మూవీ నిర్మాతగా కమల్ విచారణకు హాజరయ్యారు. దీంతో కర్ణాటక హైకోర్టు సైతం కమల్‌కి చీవాట్లు పెట్టింది. భాషపై కామెంట్స్ చేయాల్సి అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. క్షమాపలు చెప్పాల్సిందే అని తీర్పు ఇచ్చింది. దీంతో క్షమాపణలు చేప్పేందుకు నిరాకరించడమే కాదు.. తన సినిమా థగ్ లైఫ్‌ని కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి షాకిచ్చాడు. . ఈ పరిణామల నేపథ్యంలో భాష వివాదంపై తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి స్పందించారు.
‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రానాకు కమల్ హాసన్ కన్నడ భాష వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై రానా స్పందిస్తూ.. “ప్రతి ఒక్కరు తమ భావాలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే మాధ్యమంగా సోషల్ మీడియా మారింది. ఒకప్పుడు ఇలాంటి మాధ్యమాలేవి లేవు. దీంతో ఇప్పుడు ఏం మాట్లాడిన అది వివాదస్పదం అవుతోంది. ప్రతీ దాన్ని రాజకీయం చేస్తున్నారు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం రానా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ ఇవాళ విడుదలైంది. కర్ణాటక మినహా దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమళ్, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలైంది. ఇక రానా దగ్గుబాటి, విక్టరి వెంకటేష్‌లు నటించి రానా నాయుడు వెబ్ సిరీస్ తొలి సీజన్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా రానా నాయుడు 2ని తీసుకువస్తున్నారు. జూన్ 13న నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ వైడ్ ఈ సిరీస్ విడుదల కాబోతోంది.