Published On:

Samantha: నకిలీ మందులతో మోసం.. సమంతపై మరోసారి ద లివర్‌ డాక్టర్‌ ఫైర్‌

Samantha: నకిలీ మందులతో మోసం.. సమంతపై మరోసారి ద లివర్‌ డాక్టర్‌ ఫైర్‌

Samantha Blasted By The Liver Doctor For NMN Tablet Promotion: హీరోయిన్‌ సమంత ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తను మయోసైటిస్‌ బారిన పడినప్పటి నుంచి ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెడుతోంది. అంతేకాదు తన పాడ్‌కాస్ట్‌ ద్వారా ఆరోగ్య సమస్యలపై అవగాహన కూడా కల్పిస్తోంది. నిపుణులతో ముచ్చటిస్తూ వారి నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకుంటుంది. వాటిని ప్రజలతో పంచుకుంటుంది.

 

ఇందులో భాగంగా కొన్ని రోజులుగా ఆమె ఎన్‌ఎమ్‌ఎన్(నికోటినమైడ్‌ మోనోన్యూక్లియోటైడ్‌) అనే సప్లమెంట్స్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇది డీఎన్‌ఏను రిపేర్‌ చేసి మన వయసు పెరగనీయకుండ చేస్తుందని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఈ ఎన్‌ఎమ్‌ఎన్‌ టాబ్లెట్స్‌ తయారు చేస్తున్న గటకా సంస్థ కో-ఫౌండర్‌గా కూడా సమంత వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్‌ఎమ్‌ఏ సప్లీమెంటరీస్‌ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. “ఈ టాబ్లెట్స్‌ గురించి వాటి ఫలితాలే చెబుతున్నాయి. నేను వీటిని తీసుకోవడమే కాదు.. గటకా సంస్థ వ్యవస్థాపకురాలిగా కూడా మారాను” అని వెల్లడించింది.

 

అయితే సమంత సూచిస్తున్న ఈ మందులు అత్యంత ప్రమాదకరమైనవని, సమంత నకీలి మందులను ప్రమోట్‌ చేస్తుందని ఆరోపించాడు ద లీవర్‌ డాక్టర్‌. గతంలోనూ సమంత చెప్పిన ఓ వీడియోపై అతడు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి సమంత ప్రమోట్‌ చేస్తున్న ఎన్‌ఎమ్‌ఏ సప్లిమెంటరీ వీడియోపై ఆయన భగ్గుమన్నారు. సైన్స్‌ తెలియని నటి పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులన మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల పాటు ఎలుకలపై ప్రమోగం చేసినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కస్తంత యాక్టివ్‌గా ఉన్నట్టు తేలిసింది.. కానీ వాటి వల్ల జీవితకాలం పెరిగిందనో, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయని నిరూపితం కాలేదన్నారు.

 

ఈ మందులు శీరరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్‌ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు. నిజంగానే మీ వయసు కనిపించకుండ మరింత యంగ్‌గా కనిపించాలంటే ఆహారశైలి, వ్యాయమం, నిద్ర పై ఫోకస్‌ పెట్టాలని ఆయన సూచించారు. సిగరేట్‌, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటలను నమ్మొద్దని, నిజమైన సైన్స్‌, సాక్ష్యాలను మాత్రమే నమ్మాలని ఆయన కోరాడు.