Published On:

Gurmeet Choudhary: బుల్లితెర జంట ఇంట్లో పనిమనిషి చోరీ – అంతా ఇంట్లో ఉండగానే విలువైన వస్తువులతో పరార్‌

Gurmeet Choudhary: బుల్లితెర జంట ఇంట్లో పనిమనిషి చోరీ – అంతా ఇంట్లో ఉండగానే విలువైన వస్తువులతో పరార్‌

New Domestic Help Robbery in Actor Gurmeet Choudhary Home: బుల్లితెర జంట గుర్మీత్‌ చౌదరి, దెబీనా బెనర్జీ ఇంట భారీ చోరీ జరిగింది. వారింట్లో పని చేసే వ్యక్తి విలువైన వస్తువులను దొంగలించి పారిపోయాడని స్వయంగా నటుడు, మోడల్‌ గుర్మీత్‌ వెల్లడించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తాము ఇంట్లో ఉండగానే ఈ దొంగతనం జరిగిందని చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపరిచే అంశం.

 

“జాగ్రత్త: మా ఇంట్లో కొత్త చేరిన పనిమనిషి కొన్ని వస్తువులను దొంగలించుకుని పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరూ పనిలోకి చేరిన వారి వివరాలు అన్ని అడిగి తెలుసుకుంటాం. అలా చేయడం వల్ల అతడిని పట్టుకోవడం సులువైంది. సుమారు మా వస్తువలన్నింటిని రాబట్టుకున్నాం. దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూంలో సేఫ్‌గానే ఉన్నారు. ఇది మా బ్యాడ్‌ లక్‌. అయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.

 

మీ ఇంట్లోకి కొత్తగా ఎవరూ పనిలోకి వచ్చినా వారిని వివరాలు పదే పదే అడిగి తెలుసుకోండి. అప్రమత్తంగా ఉండండి” అని సూచించాడు. కాగా బుల్లితెర నటులైన గుర్మీత్‌ చౌదరి- దెబీనా బెనర్జీలు హిందీ రామయణ్‌ సీరియల్లో సితారాముడిగా నటించారు. ఈ సీరియల్‌తో వారు మంచి గుర్తింపు పొందారు. అదే టైంలో ప్రేమలో పడ్డ వీరు కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం 2011 ఫిబ్రవరి 15న వీరు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఐవీఎఫ్‌ ద్వారా లియాన జన్మించింది. ఆ తర్వాత దివిషా పుట్టింది. ఇక దెబీనా తెలుగులో హీరోయిన్‌గా నటించింది. అమ్మాయి అబ్బాయిలు అనే చిత్రంలో అమె హీరోయిన్‌గా నటించింది. పేరరసు అనే తమిళ మూవీలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది.