Published On:

Back Pain: దీర్ఘకాలిక వెన్నునొప్పికి చికిత్స ఇంత సులువా.! పాటించండి సుఖపడండి.!

Back Pain: దీర్ఘకాలిక వెన్నునొప్పికి చికిత్స ఇంత సులువా.! పాటించండి సుఖపడండి.!

 

Back pain treatment at home in telugu:  వెన్నెముకకు  గాయం అయినప్పుడు ఈ సూచనలు పాటించాలి. ఇంట్లోనే తేలికపాటి చిట్కాలు పాటిస్తే నొప్పి అదుపులోకి వస్తుంది. 12వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నొప్పి ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి.

 

దీర్ఘకాలిక వెన్నునొప్పి 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇది వెన్నెముక సమస్యలు, ఆర్థరైటిస్, నరాల కుదింపు లేదా కండరాల ఒత్తిడి వంటి అంశాల నుండి పుడుతుంది. కాలక్రమేణా, దీర్ఘకాలిక వెన్నునొప్పిని కలుగజేయడమే కాకుండా మానసిక మరియు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది.

 

నిద్ర, మానసిక స్థితితో పాటు మనిషి జీవన ప్రమానాన్ని ప్రభావితం చేస్తుంది. వెన్ను నొప్పిని కంట్రోల్ చేయకపోతే వైకల్యానికి దారితీస్తుంది. వెన్ను నొప్పి కారణంగా నిద్ర సమస్య తలెత్తుతుంది. నిరంతర నొప్పి నిరాశ, ఆందోళనకు దారితీస్తుంది. కాలక్రమేణా, దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉన్నవారు రోజువారీ జీవితంలో పరిమితంగా పనులు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు కూడా తగ్గించుకోవలసి వస్తుంది.

 

వెన్నునొప్పి కారణంగా శారీరకంగానూ ఫిట్ నెట్ తగ్గుతుంది. దీంతో ఒకే దగ్గర కూర్చుని పనిచేయడంతో బరువు పెరిగే అవకాశం ఉంది. దీర్గకాలిక నొప్పిన మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక నొప్పితో పనులు చేయడం కష్టమవుతుంది. దీంతో మనిషికి పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. ఇది సామాజిక బంధాలను ప్రభావితం చేస్తుంది.

దీర్ఘకాలిక వెన్నునొప్పి తగ్గడానికి చిట్కాలు…

నడక, స్విమ్మింగ్ తో నొప్పిని తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఇవి వీపు కండరాలను నొప్పి లేకుండా పరిష్కరిస్తాయని చెబుతున్నారు.

సాధారణ వ్యాయామాలు వెన్నునొప్పి ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆఫీసులో ఉద్యోగులు కూర్చునే చేర్ లో వెన్ను నొప్పి తగ్గడానికి పిల్లోలను వాడాలి. వీటితో పాటు వెచ్చని కంప్రెస్ లు ,  కోల్డ్ ప్యాక్ లను కూడా నొప్పితగ్గించడానికి ఉపయోగించవచ్చు. దీంతో పాటే  మంట, తిమ్మిరిని ఇవి తగ్గిస్తాయి.  ద్యానం, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు రోజూవారి దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలా ప్రతీరోజు చేయడం వలన దీర్ఘకాలిక వెన్నునొప్పికి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది ఏ రకమైన వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం నిపుణులైన డాక్టర్ ను సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి: