Suriya @Palani Murugan Temple: పళని దేవాలయంలో హీరో సూర్య, వెంకీ అట్లూరి పూజలు!
Hero Suriya and Venky Atluri visited Palani Murugan Temple: హీరో సూర్య ఈసారి తెలుగు డైరెక్టర్‌తో జతకడుతున్నాడు. ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించడం లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కంగువ’ నిరాశ పరిచింది. ఇటీవల నటించిన రెట్రో మూవీ మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా మిగత భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తమిళంలో మంచి వసూళ్లు చేసిన ఈ సినిమా ఇతర భాషల్లో పెద్దగా రాణించలేకపోయింది. అయినా ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. రెట్రో రిలీజైన వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈసారి తెలుగు డైరెక్టర్‌తో జతకడుతున్నాడు. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రకటన వచ్చింది.
అలాగే ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇక రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దానికంటే ముందు తాజాగా హీరో సూర్య, డైరెక్టక్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు పళని మురుగన్ ఆలయంతో దర్శనం చేసుకున్ఆనరు. సినిమా స్క్రిప్ట్ పేపర్‌తో పళనికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సో షల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి ఇద్దరు సంప్రదాయ పద్దతిలో పంచెకట్టులో కనిపించారు. ఇక సూర్య 46వ చిత్రంగా ఇది రూపొందనుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాధిక శరత్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్‌లు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అదించనున్నాడు.