Coffee: కాఫీ తాగిన తర్వాత ఆందోళనగా అనిపిస్తుందా? అందుకు మార్గాలు ఉన్నాయి!

Cacao with coffee benefits: కాఫీ తాగిన తర్వాత ఆందోళనగా అనిపిస్తుందా? ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి మరో మార్గం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు.
Anxious After Drinking Coffee: అద్భుతమైన సువాసనతో కూడిన కాఫీ, సమాజంలోని చాలా మందికి అత్యంత ఇష్టమైనది. కొందరు బిజీగా పనివేళల్లో మేల్కొని ఉండటానికి ఇష్టపడతారు, మరికొందరు చల్లని లేదా వర్షపు వాతావరణంలో వేడి వేడి కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కానీ కాఫీ తాగిన తర్వాత ఎప్పుడైనా ఆందోళన చెందుతున్నారా? పోషకాహార నిపుణులు నాగ్‌పాల్ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకు మీకు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.
ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఇలా ఉది. “నా క్లయింట్లలో చాలా మంది కాఫీ తాగిన తర్వాత తమకు ఆందోళన కలిగిస్తుందని ఫిర్యాదు చేస్తున్నారు” అని ఆమె చెప్పింది. అందుకు ఆవిడ నివారణా ప్రక్రియను చెప్పింది. కాఫీకి బదులుగా కోకో పౌడర్ ను వాడాలని సూచించింది. ఇది కూడా కాఫీ లాగే ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి రిలాక్స్ గా ఉంచడానికి సహాయపడుతుందని తెలిపింది.
కోకో అనేది థియో బ్రోమా కాకో అనే చెట్టు నుంచి వచ్చిన గింజలు. వీటితో ప్రముఖ కంపెనీలు చాక్లెట్లను తయారు చేస్తారు. అయితే ఆ గింజల పొడిని కాఫీ గింజల పొడికి బదులుగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా ఎవరికైతే కాఫీ తాగిన తర్వాత ఆందోళనగా ఉంటుందో వారికి మాత్రమే. అది కూడా కాఫీ కి ప్రత్యామ్నాయంగా వాడాలి. అయితే ఈ కోకోను వేడి నీళ్లల్లో, పాలల్లో వేసుకుని తాగవచ్చట.
View this post on Instagram
నిపుణులు తెలిపిన ప్రకారం, పచ్చి కోకో అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మెగ్నీషియం, ఇనుము, రాగి మరియు బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. సూపర్ ఫుడ్‌గా, పచ్చి కోకో గుండె మరియు మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అదనంగా, ఇది ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు నాడీ వ్యవస్థపై శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మొత్తంమీద, పచ్చి కోకో సున్నితమైనది, బలపరిచేది మరియు లోతుగా నయం చేస్తుంది.
గమనిక. ఇది నిపుణుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు పై విషయాలను అనుసరించే ముందు డాక్లర్ల సలహా తప్పనిసరి తీసుకోగలరు. ఖచ్చితత్వానికి చానల్ బాథ్యత వహించదు.