The Raja Saab: హై అలర్ట్.. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ – మండిపడుతున్న నెటిజన్స్

Director Hints The Raja Saab Teaser: ఎట్టకేలకు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గత మూడేళ్లుగా షూటింగ్‌ని జరుపుకుంటూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు చిత్రీకరణ పూర్తి కాలేదు. పైగా అప్‌డేట్స్ కూడా రావడం లేదు. ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ వల్ల ఈ మూవీపై ఫ్యాన్స్ పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. కానీ, అసలు అ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడెప్పుడు పూర్తవుతుంది.. అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
‘ది రాజాసాబ్’ హై అలర్ట్
ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చే ఒక అప్‌డేట్ ఇవ్వడంటూ డైరెక్టర్ మారుతి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ, ఈ విషయంలో ఆయన సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. అయితే ఆకస్మాత్తుగా హై అలర్ట్ అంటూ శుక్రవారం ది రాజాసాబ్ గురించి ఓ పోస్ట్ చేశారు. “హై అలర్ట్.. మే నెల మధ్యలో వేడి తరంగాలు మరింత పెరగనున్నాయి” అంటూ ట్వీట్ వదిలారు. ఈ సందర్భంగా ఆటో వెనకాల ప్రభాస్ రాజాసాబ్‌తో ఉన్న పోస్టర్‌ని షేర్ చేశారు. అయితే ఇది టీజర్ అప్‌డేట్ అయ్యింటుందని అంతా భావిస్తున్నారు. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘హమ్మయ్య ఫైనల్‌గా రాజాసాబ్ నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చారు.. థాంక్యూ మారుతి గారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడీ అప్డేట్ అవసరమా
అయితే కొందరు నెటిజన్స్ మాత్రం మారుతి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అప్‌డేట్ పట్ల ఇచ్చిన టైం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ భారతీయుడిగా కనీస బాధ్యత కూడా లేదంటూ డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ‘దేశమంత పహల్గాం ఎటాక్‌తో దిగ్బ్రాంతిలో ఉంటే.. ఈ టైంలో ఈ అప్‌డేట్ ఇవ్వడం అవసరమా. కనీస బాధ్యత లేదా?’ అని కామెంట్స్ చేస్తున్నారు. పహల్గాం ఘటనపై స్పందిస్తూ పోస్ట్ పెట్టే టైం లేదు కానీ.. ఎప్పుడో రిలీజ్ చేసే తన మూవీ అప్‌డేట్ కోసం పోస్ట్ చేసే టైం దొరకిందా? అని మారుతి కడిగిపారేస్తున్నారు. ఇలా పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్‌తో మారుతి ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది.
కామెడీ,హారర్ గా రాజాసాబ్
కాగా ది రాజాసాబ్‌లో కామెడీ, హారర్ జానర్ అని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ రెండు పోస్టర్స్‌కి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా రాజుగా సింహాసనంపై కూర్చుని చుట్టా కాలుస్తూ.. రాయల్ లుక్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ లుక్ మూవీపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రిద్ధి కుమార్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ వంటి నటీనటులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
HIGH ALERT…
HEAT WAVES gonna rise even higher from mid May!pic.twitter.com/EdEdtMCq6E
— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025