Bhagyashree Injury: ప్రభాస్ రీల్ తల్లి తలకు గాయం.. 13 కుట్లు వేసిన డాక్టర్స్

Bhagyashree Injury: అందాల నటి భాగ్యశ్రీని మర్చిపోవడం ఎవరి వలన కాదు. మైనే ప్యార్ కియా అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో ఆ సినిమానే ప్రేమ పావురాలు అనే పేరుతో డబ్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఏ నటికి అయినా.. నటుడుకు అయినా.. తమ కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక సినిమా ఉండాలి. భాగ్యశ్రీకి అలాంటి సినిమానే ప్రేమ పావురాలు. ఆమె ఇండస్ట్రీలో ఉన్నా.. లేకున్నా ఆ సినిమాను.. అందులో ఆమె నటనను ఏ ప్రేక్షకుడు మరిచిపోలేడు.
ఇక ఈ సినిమా తరువాత తెలుగులో రెండు మూడు సినిమాల్లో కనిపించిన భాగ్యశ్రీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. సీనియర్ నటీమణులందరూ బయటపడుతున్నారు. ఇక భాగ్యశ్రీ కూడా తెలుగులో రాధేశ్యామ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా ఆమె చేసింది చిన్న రోల్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ప్రస్తుతం భాగ్యశ్రీ తన వరుసలను చక్కదిద్దే పనిలో పడింది.
భాగ్యశ్రీ కొడుకు, కూతురును కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె కూతురు అవంతిక దాసాని.. బెల్లంకొండ గణేష్ నటించినా నేను స్టూడెంట్ సార్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. భాగ్యశ్రీ తలకు గాయం అయ్యినట్లు తెలుస్తోంది. ఈమధ్యనే ఆమె పికెల్ బాల్ ఆడుతూ తలకు బాల్ తగలడంతో పెద్ద గాయమే అయ్యిందని సమాచారం. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. ఆమెకు 13 కుట్లు వేశారట.
ఇక ఈ విషయాన్నీ భాగ్యశ్రీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తలకు గాయంతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే తాను బాగానే ఉన్నానని చెప్పడంతో కొద్దిగా నెమ్మదించిన అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాధేశ్యామ్ తరువాత తెలుగులో భాగ్యశ్రీ మళ్లీ కనిపించలేదు. మరి టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా ఆమెను ముందు ముందు మంచి రోల్స్ లో చుపిస్తారేమో చూడాలి.